కష్టాలు వస్తే దిగజారిపోవాలా, అందుకే సావిత్రిని చివరి రోజుల్లో నేను చూడలేదు.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్

First Published | Nov 23, 2024, 10:53 AM IST

మహానటి సావిత్రి జీవితం గురించి అందరికీ తెలిసిందే. నటిగా శిఖరాగ్రానికి ఎదిగిన సావిత్రి చివరి రోజుల్లో మాత్రం ఎంతో క్షోభ అనుభవించి మరణించారు. వ్యక్తిగత జీవితం, తాను తీసుకున్న నిర్ణయాలు ఇలా ఆమె కష్టాలకు అనేక కారణాలు కనిపిస్తాయి. 

మహానటి సావిత్రి జీవితం గురించి అందరికీ తెలిసిందే. నటిగా శిఖరాగ్రానికి ఎదిగిన సావిత్రి చివరి రోజుల్లో మాత్రం ఎంతో క్షోభ అనుభవించి మరణించారు. వ్యక్తిగత జీవితం, తాను తీసుకున్న నిర్ణయాలు ఇలా ఆమె కష్టాలకు అనేక కారణాలు కనిపిస్తాయి. ఆమె గురించి తెలిసిన వారు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుంటారు. 


Also Read: ఆమె కన్నీళ్లు పెట్టుకుందా, పెళ్ళైన కొద్దిరోజులకే.. స్టార్ హీరో భార్యపై ప్రభాస్ ఎవ్వరూ ఊహించని కామెంట్స్

అలనాటి నటి కృష్ణకుమారి ఓ ఇంటర్వ్యూలో సావిత్రి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణ కుమారి, సావిత్రి అనేక చిత్రాల్లో కలసి నటించారు. కృష్ణ కుమారి పౌరాణిక పాత్రల్లో సైతం మెప్పించారు. సావిత్రిని కృష్ణ కుమారి తన సొంత అక్కగా భావిచే వారట. ఆమెతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సావిత్రి ఎంతో ట్యాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ అని కృష్ణ కుమారి ప్రశంసించారు. 


కానీ ఆమె పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం నాకు చాలా కోపం ఉంది అని కృష్ణ కుమారి అన్నారు. సావిత్రి గారి జీవితం చివరి రోజుల్లో అలా కావడానికి కారణం ఆమె వ్యక్తిగత జీవితం కావచ్చు. వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒడిదుడుకులు ఉంటాయి. ప్రతి ఒక్కరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాగని చెప్పి దిగజారిపోవడం తప్పు. అంత గొప్ప నటి తన జీవితాన్ని ఎందుకు అలా చేసుకుంది.. ఆమె తెలివితేటలు ఏమయ్యాయి అని కృష్ణ కుమారి ప్రశ్నించారు. 

అందుకే నాకు సావిత్రిపై కోపం వచ్చింది. చివరి రోజుల్లో కూడా చూడడానికి నేను వెళ్ళలేదు అని కృష్ణ కుమారి అన్నారు.  కృష్ణ కుమారి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి అగ్ర హీరోలతో నటించారు. 

2018లో కృష్ణకుమారి అనారోగ్యంతో మరణించారు. తెలుగులో ఆమె పాతాళ భైరవి చిత్రంతో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కులగోత్రాలు, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు, చిక్కడు దొరకడు లాంటి చిత్రాలు కృష్ణ కుమారికి మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. 

Latest Videos

click me!