అయ్యేవాడే కాని యష్మి చాలా తెలివిగా వేసిన దెబ్బ.. వెన్నుపోటు వల్ల పృధ్వీ మెగా చీఫ్ అవ్వలేకపోయాడు. విశ్వక్ సేన్ వచ్చి వెళ్ళిన తరువాత హౌస్ లో ఉన్న ఆటో చీఫ్ రేస్ కు మొదటి అడుగు అయ్యింది. ఆటోలో కంటెండర్లు బజర్ మోగగానే వెళ్ళి కూర్చోవాలి. వారి సీట్ ను పదిలం చేసుకుంటూనే పక్కవారిని తోసేయాలి. ఇది టాస్క్. పృధ్వీ, విష్ణు, యష్మి, తేజ, రోహిణి. ఆటోలోకి వెళ్ళిసెటిల్అయ్యారు బట్ మొదట తేజను, ఆతరువాత రోహిణిని ఆటోలోంచి తోసేశారు.
ఇక యష్మిని కూడా విష్ణు ప్రియ బయటకు తోసేప్రయత్నం చేసింది. విష్ణు ప్రియకు పృధ్వీ సాయం చేయడంతో యష్మి కూడా ఆటోలోంచి పడిపోయింది. దాంతో యష్మికి కోపం వచ్చింది. కావాలని పృధ్వీ విష్ణు తోకలిసి ఇలా చేశారని. ఇక మీరు లోపల ఉన్నారు కదా.. ఎలా ఆడతారో చూద్దాం.. ఖచ్చితంగా ఇద్దరు పుష్ చేసుకోవాలి. కాంప్రమైజ్ అయ్యి వస్తే ఊరుకునేది లేదు అంటూ గట్టిగా అరిచింది యష్మి.