రామ్ చరణ్ హీరోయిన్ కియారా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. ఇవి మీకు తెలుసా?

First Published | Jul 27, 2023, 3:31 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తాజాగా ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొంది. త్వరలో ‘గేమ్ ఛేంజర్’తో అలరించబోతోంది. అయితే ఆమె గురించి కొన్నిఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. 
 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) జూలై 31, 1991లో ముంబైలో జన్మించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు 31 ఏళ్లు. సింధీ హిందూ వ్యాపారవేత్త జగ్దీప్ అద్వానీ, జెనీవీవ్ జాఫ్రీ ఆమె తల్లిదండ్రులు. తండ్రి లక్నోకు చెందినవారు కాగా, తల్లి స్కాటిష్, ఐరిష్, పోర్చుగీస్, స్పానిష్ సంతతికి చెందినవారు. ఆమె బ్రదర్ మిషాల్ ఉన్నారు. 

అద్వానీ ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్‌లో చదివారు. ఆ తర్వాత అక్కడే జై హింద్ కాలేజీలో చేరారు. మాస్ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టాను పొందారు. 2014 నుంచి కియారా బాలీవుడ్ నటిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ‘ఫగ్లీ’తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఇప్పటి వరకు ఇరవై చిత్రాల్లో నటించారు. 
 


ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇలా ఉన్నాయి.. కియారా ఇండస్ట్రీలోకి రావడానికి ముందు టీనేజ్ లోనే హిందీ సినిమాలపై ఆసక్తిగా ఉండేదంట. 2001లో వచ్చిన ‘కభీ కుషీ కభీ గబ్’ చిత్రంలోని ప్రతిసాంగ్, డైలాగ్ తనకు చాలా బాగా గుర్తున్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక డాన్స్ కూడా చేస్తుండేదని చెప్పింది. 
 

మరోవైపు బాలీవుడ్ చాలా మంది హీరోయిన్లు సినిమాల్లోకి వచ్చే ముందు తమ పేర్లను మార్చుకోవడం.. లేదా మార్పు చేయడం వంటి చేసుకున్నారు. ఇక కియారా కూడా తన స్క్రీన్ నేమ్ ను మార్చుకున్నారు. ఆమె అసలు పేరు అలియా కియారా.  ఈ నేమ్ అలియా భట్ తో మ్యాచ్ అవుతుండటంతో.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సూచన మేరకు కియారా అని మార్చుకుందంట. అలాగే ఆ పేరును ప్రియాంక చోప్రా మూవీ ‘అంజనా అంజానీ’ నుంచి ఎంచుకున్నట్టు తెలిపింది.  ప్రస్తుతం కియార అద్వానీగా ప్రేక్షకుల్లో ముద్ర వేసుకుంది. 
 

 కియారా ఓసారి కాలేజీ ట్రిప్ కు వెళ్లినప్పుడు ప్రమాదానికి గురైందంట. దాదాపు చావు అంచువరకు వెళ్లి బతికిందని చెప్పింది. ఇక ఇండస్ట్రీలోకి రాకముందు కియారా ముంబైలోని బర్డ్స్  ప్లే స్కూల్లో మ్యూజిక్ టీజర్ గానూ వర్క్ చేసిందంట. అక్కడే ఆమె తల్లి హెడ్మాస్టర్ గా విధులు నిర్వహించారంట. ఆమె చిన్నప్పుడే ఓ కమర్షియల్ యాడ్ లో కూడా నటించినట్టు గతంలో తెలిపారు. 

నిన్న న్యూ ఢిల్లీలో డిజైనర్ రీతూ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన FDCI ఇండియా కౌచర్ వీక్ 2023 ఈవెంట్ లో బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కియారా పింక్ అవుట్ ఫిట్ లో హాజరై ఆకట్టుకుంది. ర్యాంప్ వ్యాక్ కూడా చేసి మంత్రముగ్ధులను చేసింది. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ లోకి కియారా ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రామ్ చరణ్ సరన ‘వినయ విధేయ రామ’లో నటించింది. ప్రస్తుతం మరోసారి చెర్రీతో కలిసి బిగ్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తూ బిజీగా ఉంది. అటు హిందీలో ఆయా చిత్రాల్లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!