పొట్టి డ్రెస్ లో గ్లామర్ విందు చేస్తూ కీర్తి సురేష్ యోగాసనాలు.. వైరల్ అవుతున్న పోజులు.!

First Published | Feb 11, 2023, 2:37 PM IST

హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నారు. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఫిట్ సెన్ కోసం కఠినమైన యోగాసనాలు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. 
 

హీరోయిన్ కీర్తి సురేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం ‘మహానటి’. అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతమైన పెర్ఫామెన్స్ కనబర్చిన విషయం తెలిసిందే. 
 

ఈ చిత్రంలో నటిగా సత్తా చాటడమే కాకుండా.. జాతీయ స్థాయి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు కీర్తి సురేష్. అప్పటి నుంచి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కూడా వచ్చింది. రామ్ పోతినేని, నాని, తమిళ స్టార్ సూర్య, శివ కార్తికేయతో నటించి మెప్పించారు. 


కీర్తి సురేష్ నటనతో మెప్పించడంతోనే కాకుండా.. ఇటీవల వెండితెరపై అందాలను ఒళకబోస్తున్నారు. చివరిగా తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. చిత్రంలో నటనతో పాటు.. డాన్స్, గ్లామర్ షోతో కూడా చేసి ప్రేక్షకులను కట్టిపడేశారు. 
 

ఇక ఎప్పటికీ ఫిట్ గా, గ్లామర్ గా కనిపించేందుకు కీర్తి సురేష్ పలు ఎక్సర్ సైజ్ లు, ఫిట్ నెస్ సంబంధింత వర్కౌట్స్ చేస్తుంటారు. తాజాగా కఠినమైన యోగాసనాలు వేస్తూ దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కీర్తి సురేష్. 
 

ఈ వీడియోలో.. కీర్తి సురేష్ పచ్చదనంతో నిండిపోయిన గార్డెన్ లో పొట్టి డ్రెస్ లో కఠినమైన యోగాసానాలు వేశారు. ఒకవైపు గ్లామర్ విందు చేస్తూనే.. మరోవైపు ఒంట్లోని ఫ్యాట్ ను కరిగించేస్తున్నారు. మరింత స్టిమ్ గా, ఫిట్ తయారయ్యేందుకు ఇలా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

‘సర్కారు వారి పాట’ ఇచ్చిన జోష్ లో కీర్తి సురేష్ వరుస చిత్రాలను అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో నాని ‘దసరా’లో నటించగా.. విడుదలకు సిద్ధమవుతోందీ చిత్రం. ఇక చిరుకు చెల్లెలిగా ‘భోళా శంకర్’లోనూ నటిస్తున్నారు. ఇదిలా ఉండేగా రీసెంట్ గా ‘రివాల్వర్ రీటా’ సినిమాను ప్రకటించారు. ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇక తమిళంలో ‘సైరెన్, మామన్నన్, రఘు తాత’ వంటి సినిమాలు చేస్తూ బిజీగా  ఉన్నారు. 

Latest Videos

click me!