తన బాయ్ ఫ్రెండ్ పై మొదటిసారిగా స్పందించిన కీర్తి సురేష్.. ‘మిస్టరీ మ్యాన్’ అంటూ ఓపెన్ అయిన కళావతి

First Published | May 23, 2023, 5:01 PM IST

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)  బాయ్ ఫ్రెండ్ అంటూ కొద్దిరోజులుగా ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా నటి కీర్తి స్పందించింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
 

‘మహానటి’తో కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నటనకు ఏకంగా జాతీయ స్థాయిలో అవార్డును కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ వస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలూ చేస్తోంది.
 

నటిగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫుల్ బిజీగానే ఉందని చెప్పాలి. సినిమాల ఫలితాలు ఎలా ఉన్న కీర్తి సురేష్ పేరు మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటోంది. ఇటీవల మాత్రం కీర్తి పెళ్లి మేటర్, తన బాయ్ ఫ్రెండ్ గురించి నెట్టింట న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.
 


కొద్దిరోజులుగా మాత్రం కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఓ ఫొటో వైరల్ గా మారింది. కళావతికి బిజినెస్ మెన్ అయిన తన బాయ్ ఫ్రెండ్ ను ఇలా పరిచయం చేసిందంటూ.. త్వరలో పెళ్లి కూడా ఉంటుందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై తొలిసారిగా కీర్తి స్పందించడం హాట్ టాపిక్ గ్గా మారింది.
 

కీర్తి సురేష్ ట్వీటర్ వేదికన స్పందిస్తూ.. ‘ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్ ని ఇలాంటి వార్తల్లోకి తీసుకొచ్చారా? నా లైఫ్ లో నిజమైన మిస్టరీ మ్యాన్ ను సమయం వచ్చినప్పుడు తప్పకుండా రివీల్ చేస్తాను. అప్పటి దాకా చిల్ పిల్ తీసుకోండి. దీనిలో నిజం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.
 

ఇలా తనపెళ్లిపై, బాయ్ ఫ్రెండ్ పై వస్తున్న వార్తలను కూడా కీర్తి ఫన్నీగా తీసుకుంటూ బదులివ్వడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ కీర్తి జీవితంలోని ఆ మిస్టరీ మ్యాన్ ఎవరనేది ప్రస్తుతం ఆసక్తిని కలిగించే అంశంగా మారింది. దీనిపై మున్ముందు ఎలాంటి అప్డేట్ ఇస్తుందో చూడాలి అంటున్నారు. 
 

ప్రస్తుతం కీర్తి కేరీర్ జోరుగానే సాగుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అదరగొడుతోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ వస్తోంది. చివరిగా తెలుగులో ‘సర్కారు వారి పాట’తో అలరించింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’లో కీలక పాత్ర పోషిస్తోంది.

Latest Videos

click me!