ఆ స్టార్ హీరో నాపై పగబట్టాడు, మూడు సినిమాలు కోల్పోయాను.. నటి కస్తూరి ఆవేదన..

Published : Feb 29, 2024, 12:40 PM IST

హీరోయిన్ గా వెండితెరపై హిట్ సినిమాలు చూసిన కస్తూరి.. ఆతువాత బుల్లితెరకు షిప్ట్ అయ్యింది. గృహలక్ష్మిగా అలరించిన కస్తూరి.. రీసెంట్ గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..? 

PREV
15
ఆ స్టార్ హీరో నాపై పగబట్టాడు, మూడు సినిమాలు కోల్పోయాను.. నటి కస్తూరి ఆవేదన..

ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా..  హీరోయిన్ గా నటి కస్తూరి శంకర్ మంచి పేరు తెచ్చుకుంది. అన్నమయ్య లాంటి సినిమాల్లో ఆమె నటన మెప్పించింది. అయితే ఈమె చాలా తక్కువ సినిమాలలో హీరోయిన్ గా నటించి.. చాలా చిన్నవయస్సులోనే పెళ్ళి చేసుకుంది. ఆతరువాత  ఇండస్ట్రీకి దూరమయ్యింది. సినిమాలకు దూరం అయిన కస్తూరి.. ఫారెన్ లో సెటిల్ అయ్యి.. రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది.  
 

25

ఒకవైపు  సీరియల్స్ చేస్తూ.. అటు వెబ్ సిరీస్ లలోకూడా సందడిచేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా ఉన్న  కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈమె తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి కూడా తన అభిప్రాయాలను తెలియజేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు. ఇలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి షాకింగ్ విషయాలు వెల్లడించింది.
 

35

ఒక ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ .. ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తున్న టైమ్ లో.. ఓ  హీరోతో నేను మూడు సినిమాలు ఒప్పుకున్నాను. అందులో మొదటి సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా  షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అతను నన్ను వేదించడం స్టార్ట్ చేశాడు. టార్చర్ చేస్తూ వచ్చాడు. అంతే కాదు  అతను తన లిమిట్స్ దాటి ప్రవర్తించాడు అని అన్నారు. 
 

45

దాంతో  నేను అసహనాన్ని వ్యక్తం చేశాను. ఆ కారణంగా ఆయన మిగతా రెండు సినిమాలలో నుంచి నన్ను తీసేయించారు" అని అన్నారు కస్తూరి. మిగతా రెండు సినిమాలలో నుంచి తప్పించడం వలన నేనేం బాధపడలేదు. అది కూడా మంచికే జరిగిందని అనుకున్నాను. ఎందుకంటే మనసులో తిట్టుకుంటూ .. పైకి నవ్వుతూ పలకరిస్తూ  నటించడం నా వల్ల కాదు అని అన్నారు కస్తూరి. ప్రస్తుతం ఈ కామెంట్స్  సోషల్ మీడియాలో వైరల్. 

55
kasthuri

హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో సండడి చేసిన కాస్తూరి.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లు కాని. .కాంట్రవర్సీయల్  సబ్జెక్ట్స్ కాని టచ్ చేసి ఉతికి ఆరేస్తుంది కస్తూరి. సోషల్ మీడియా వేధికగా ఘాటు  స్పందలనకు ఆమెపెట్టింది పేరు. ఈమధ్య త్రిషపై అన్నా డిఎంకే నేత చేసిన కామెంట్లకు గట్టిగా ఖండించడంతో పాటు ఘాటు వ్యాక్యలు చేసింది కూడా. 

Read more Photos on
click me!

Recommended Stories