గుడ్డలూడదీసి కొడుతూ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి దాడి.. పడుకోమని అడిగాడు అంటూ..

Published : May 13, 2022, 08:59 AM IST

యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి అడల్ట్ ఫ్రాంక్ వీడియోలతో పాపులర్ అయ్యాడు. డబుల్ మీనింగ్ డైలాగులు, శృంగారపరమైన ఫ్రాంక్ వీడియోలు చేయడంతో అతడికి పాపులారిటీ లభించింది.

PREV
16
గుడ్డలూడదీసి కొడుతూ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి దాడి.. పడుకోమని అడిగాడు అంటూ..

యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి అడల్ట్ ఫ్రాంక్ వీడియోలతో పాపులర్ అయ్యాడు. డబుల్ మీనింగ్ డైలాగులు, శృంగారపరమైన ఫ్రాంక్ వీడియోలు చేయడంతో అతడికి పాపులారిటీ లభించింది. అతడి వీడియోలు యూట్యూబ్ లో బాగా వైరల్ అయ్యాయి.అయితే శ్రీకాంత్ రెడ్డిపై నటి కరాటే కళ్యాణి దాడి చేసిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది. 

26

దీనితో ఇద్దరూ పరస్పరం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహిళల్ని అసభ్యంగా చూపిస్తూ, బూతులతో ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నాడు అంటూ కరాటే కళ్యాణి అతడి ఇంటికి వెళ్లి నిలదీసింది. దీనితో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్రమైన గొడవకు దారి తీసింది. శ్రీకాంత్ రెడ్డి, కరాటే కళ్యాణి ఇద్దరూ ఒకే ఏరియాలో ఉంటున్నారు. 

36

దీనితో అతడు చేస్తున్న అసభ్యకరమైన వీడియోల్ని గమనించిన కరాటే కళ్యాణి బుద్ది చెప్పాలనుకుంది. గురువారం రాత్రి శ్రీకాంత్ రెడ్డి ఫ్రాంక్ వీడియో చేస్తుండగా అతడిని నిలదీసింది. నువ్ చేస్తున్న ఈ వీడియోలు ఏంటి.. ఈ సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నావ్ అంటూ కరాటే కళ్యాణి నిలదీసింది. ఆగ్రహంతో అతడిపై కరాటే కళ్యాణి చేసి చేసుకుంది. దీనితో కరాటే కళ్యాణి వెంట ఉన్న వ్యక్తి కూడా శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేశాడు. 

46

వెంటనే శ్రీకాంత్ రెడ్డి కరాటే కళ్యాణిని కొట్టాడు. దీనితో ఆమె కిందపడిపోవడంతో.. చుట్టూ ఉన్నవాళ్లు శ్రీకాంత్ పై దాడిచేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన కరాటే కళ్యాణి బూతులు మాట్లాడుతూ శ్రీకాంత్ రెడ్డి బట్టలు చిరిగేలా.. పరుగులు పెట్టించి మరీ కొట్టింది. దీనితో శ్రీకాంత్ కరాటే కళ్యాణితో వాగ్వాదానికి దిగాడు. ఆమెని వ్యక్తిగతంగా దూషించాడు. నీతో ఫ్రాంక్ వీడియో చేస్తుంటే తప్పు అంటున్నవ్.. నువ్ చేసే నీచమైన పనుల గురించి మాకు తెలియదా.. నువ్వేం ఉత్తమురాలివి కాదు అంటూ దూషించాడు. 

56

ఆలాగే శ్రీకాంత్ రెడ్డి మరో సంచలన ఆరోపణ కూడా చేశాడు. ఫ్రాంక్ వీడియో కోసం కరాటే కళ్యాణి రూ 2 లక్షలు అడిగిందని అది ఇవ్వను అనేసరికి నాపై ఇలా దాడి చేస్తోంది అని ఆరోపించాడు. ఆమె బాగోతం మొత్తం తెలుసు అంటూ గట్టిగా అరిచాడు. 

66

దీనితో కరాటే కళ్యాణి ఆధారాలు చూపించమని అడిగింది. తనతో పడుకోవాలని డబ్బులు ఇవ్వబోయాడని.. అసభ్యంగా తాకడానికి ప్రయత్నించాడు అని కరాటే కళ్యాణి  శ్రీకాంత్ రెడ్డిపై ప్రత్యారోపణలు చేసింది. తనని తాను రక్షించుకోవడం కోసమే కొట్టినట్లు పేర్కొంది. దీనితో ఇద్దరి వ్యవహారం ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. 

click me!

Recommended Stories