సర్కారు వారి పాట, రాధే శ్యామ్, ఆచార్య ఫెయిల్యూర్ కి కారణం అదేనా.. దారుణమైన ట్రోలింగ్

Published : May 13, 2022, 07:59 AM IST

అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ చిత్రాలు టాలీవుడ్ లో ఎంతటి జోష్ నింపాయో..  సర్కారు వారి పాట, రాధే శ్యామ్, ఆచార్య రిజల్ట్స్ అంతలా నీరుగార్చాయి. 

PREV
16
సర్కారు వారి పాట, రాధే శ్యామ్, ఆచార్య ఫెయిల్యూర్ కి కారణం అదేనా.. దారుణమైన ట్రోలింగ్

అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ చిత్రాలు టాలీవుడ్ లో ఎంతటి జోష్ నింపాయో..  సర్కారు వారి పాట, రాధే శ్యామ్, ఆచార్య రిజల్ట్స్ అంతలా నీరుగార్చాయి. పాండమిక్ తర్వాత చిత్ర పరిశ్రమ విచిత్రమైన పరిస్థితిలోకి వెళ్లిందని, జనాలు థియేటర్స్ కి రావడం లేదని స్వయంగా అల్లు అరవింద్ లాంటి నిర్మాత తెలిపారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

26

కంటెంట్ సరిగ్గా లేకుంటే ప్రేక్షకులు ఆ చిత్రాన్ని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తున్నారు. ఆచార్య, రాధే శ్యామ్ చిత్రాలు నిర్మాతలకు తీరని నష్టాల్ని మిగిల్చాయి. నిన్ననే విడుదలైన సర్కారు వారి పాట చిత్రానికి కూడా మిక్స్డ్ టాక్ మొదలయింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా స్టార్ హీరోల సినిమాలకు తొలి వీకెండ్ లో కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. 

36

సినిమా నచ్చకపోతే తొలి షో నుంచే ప్రభావం ఉంటోంది. పాండమిక్ వల్ల మారిన పరిస్థితులు , టికెట్ ధరలు, ఓటిటి ఛాయిస్ లాంటి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. ఈ చిత్రాల ఫెయిల్యూర్ కి చాలానే కారణాలు కనిపిస్తున్నప్పటికీ.. నెటిజన్ల ట్రోలింగ్ మాత్రం విభిన్నంగా ఉంది. 

46

ఒక విచిత్రమైన కారణంతో ఈ మూడు చిత్రాలని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అదేంటంటే.. ఏపీలో టికెట్ ధరల పెంపు కోసం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ప్రభాస్, మహేష్ బాబు.. సీఎం జగన్ ని ఆ మధ్యన కలిశారు. టికెట్ ధరల పెంపు కోసం జగన్ ని రిక్వస్ట్ చేసేందుకు టాలీవుడ్ నుంచి వెళ్లిన హీరోలు ఈ ముగ్గురే. 

56

ఇప్పుడు ఈ ముగ్గురి సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయి. దీనితో జగన్ ని చిరు, మహేష్, ప్రభాస్ కలిసిన ఫోటోలు షేర్ చేస్తూ.. ఒకే ఫ్రేమ్ లో డిజాస్టర్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాలు పరాజయం చెందడానికి వేర్వేరు కారణాలు ఉండొచ్చు. కానీ నెటిజన్లు మాత్రం.. ఇది జగన్ సెంటిమెంట్ అంటూ విచిత్రమైన ట్రోలింగ్ కి తెరలేపారు. 

 

66

ఈ మూడు చిత్రాల రిజల్ట్ వల్ల టాలీవుడ్ లో వణుకు మొదలయింది. స్టార్ హీరోల సినిమాలకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మిగిలిన చిన్న సినిమాల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. అయితే ఆందోళన అవసరం లేదని.. సినిమా బావుంటే ఆదరణ తప్పకుండా ఉంటుందని.. అందుకు ఉదాహరణగా అఖండ, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, కెజిఎఫ్ చిత్రాలని చెబుతున్నారు. 

 

click me!

Recommended Stories