గుప్పెడంత మనసు టీవీ సీరియల్ ఫేమ్ జ్యోతి పూర్వాజ్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. తన భర్త పూర్వాజ్ దర్శకత్వంలోనే ఆమె కిల్లర్ అనే మూవీలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జ్యోతి.. పూర్వాజ్ తో రెండో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గుప్పెడంత మనసు టీవీ సీరియల్ తో నటి జ్యోతి పూర్వాజ్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అందులో జగతి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.టీవీ సీరియల్ లో హోమ్లీగా కనిపించిన జ్యోతి పూర్వాజ్.. సినిమాల్లో మాత్రం బోల్డ్ పాత్రలు, గ్లామర్ షోతో రెచ్చిపోతున్నారు. తన భర్త పూర్వాజ్ దర్శకత్వంలో జ్యోతి నటించిన కిల్లర్ మూవీ ఇటీవల విడుదలయింది.
26
కిల్లర్ మూవీతో జ్యోతి పూర్వాజ్
ఈ సినిమా రిలీజ్ సందర్భంగా జ్యోతి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో జ్యోతి మాట్లాడుతూ పూర్వాజ్ తో తన పరిచయం, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకి ఆల్రెడీ వివాహం జరిగింది. ఓ కొడుకు కూడా ఉన్నాడు. కానీ భర్త నుంచి విడిపోయింది. పూర్వాజ్ ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనే ప్రశ్నకు సమాధానం ఆమె ఇలా ఇచ్చారు.
36
డబ్బు కోసం కాదు
చాలా మంది నేను డబ్బు కోసం పూర్వాజ్ ని పెళ్లి చేసుకున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఆమె నవ్వుతూ.. పూర్వాజ్ అకౌంట్ డీటెయిల్స్, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ మీకు తెలుసా ? నేను డబ్బు కోసమే అయితే.. ఏ అంబానీ లాంటి వాడినో పెళ్లి చేసుకోవాలి. కానీ నేను పూర్వాజ్ ని పెళ్లి చేసుకుంది ఒక సపోర్ట్, తోడు కోసమే అని జ్యోతి తెలిపారు. ప్రస్తుతం నాకు అన్నీ ఉన్నాయి. ఇల్లు, కారు, సరిపడినంత డబ్బు ఉంది. నేను పూర్వాజ్ పై.. పూర్వాజ్ నాపై ఆధారపడి లేము. కానీ ఒకరికొకరం తోడు కోసం పెళ్లి చేసుకున్నాం అని జ్యోతి తెలిపారు.
పూర్వాజ్ తో సినిమా చేస్తున్నప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడింది. అవుట్ డోర్ షూటింగ్ కోసం బయటకు తీసుకెళ్లారు. 15 రోజులు టైం పట్టింది. అప్పుడు నేను పూర్వాజ్ తో ఇక నేను ఇంటికి వెళతాను అని చెప్పాను. మేడం ఇంకో 2 రోజులు కావాలి అని అన్నారు. సార్ నేను బయటకు వచ్చి 15 రోజులు అవుతోంది. ఇంట్లో నా కొడుకు ఉన్నాడు. వాడిని వదిలిపెట్టి ఇలా రావడం చాలా కష్టంగా ఉంది అని చెప్పా. ఈ మాటలు చెబుతున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను.
56
సడెన్ గా పెళ్లి ప్రపోజల్
అప్పుడు పూర్వాజ్ నా గురించి పూర్తిగా తెలుసుకోవడం ప్రారంభించారు. అప్పుడే మా మధ్య మాటలు పెరిగాయి. వారం రోజుల తర్వాత సడెన్ గా వచ్చి మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. నేను షాక్ అయ్యాను. అరె ఏంటి అప్పుడే పెళ్లి అంటున్నాడు అని ఆశ్చర్యపోయాను. చాలా మంది ఇలా మాటల్లోకి దించే వాళ్ళు ఉంటారు. దీనితో మొదట నాకు పూర్వాజ్ మాటలపై నమ్మకం రాలేదు.
66
తోడు కోసమే పెళ్లి
మీరు నన్ను నిజంగా పెళ్లి చేసుకుంటారా అని అడిగా.. వెంటనే తన మెడలో ఉన్న చైన్ ఒకటి తీసి నా మెడలో వేశాడు. నువ్వు కట్టు బట్టలతో రా చాలు. నీ ఆస్తి ఏంటి నీ కొడుకే కదా.. తీసుకుని రా.. నేను తోడుగా ఉంటాను అని చెప్పాడు. అప్పుడు పూర్వాజ్ పై ప్రేమ పెరిగింది. ఆ విధంగా ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం అని జ్యోతి పేర్కొన్నారు. జ్యోతి రాయ్ గా ఉన్న ఆమె పెళ్లి తర్వాత జ్యోతి పూర్వాజ్ గా తన పేరు మార్చుకున్నారు.