Priyanka Chopra : 165 కోట్ల ఇల్లు.. మోసపోయిన ప్రియాంక చోప్రా.. భర్తతోపాటు ఖాళీ చేసిన వైనం!

First Published | Feb 1, 2024, 6:09 PM IST

ప్రియాంక చోప్రా Priyanka Chopra 165 కోట్ల విలువైన ఇల్లును ఖాళీ చేసింది. భర్తతో కలిసి ఉన్నట్టుండిగా ఇల్లు మారడం హాట్ టాపిక్ గ్గా మారింది. ఇంతకీ గ్లోబల్ బ్యూటీకి అక్కడ ఎలాంటి సమస్య వచ్చిందంటే.. 

గ్లోబల్ బ్యూటీ  ప్రియాంక చోప్రా ఇండియన్ ఫ్రిల్మ్స్ తో పాటు హాలీవుడ్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా బాలీవుడ్ సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసింది. 
 

ప్రస్తుతం ఇంగ్లీష్ చిత్రాల్లోనే నటిస్తూ హాలీవుడ్ లో సందడి చేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఈ ముద్దుగుమ్మ తన భర్త నిక్ జోనాస్ Nick Jonasతో కలిసి ఉంటోంది. ఈ సందర్భంగా అక్కడి ఈవెంట్లలోనూ పాల్గొంటూ ఆకట్టుకుంటోంది. 


ఇదిలా ఉంటే.. తాజాగా హాలీవుడ్ మీడియా సంస్థలు ప్రియాంక చోప్రా గురించి ఓ న్యూస్ ను వెలువరించాయి. దాని ప్రకారం.. ప్రియాంక ఉన్నట్టుండిగా తన సొంతింటిని భర్తతో పాటుగా ఖాళీ చేసింది. లాస్ ఏంజెల్స్ లోని సుందర భవనం నుంచి గ్లోబల్ బ్యూటీ కదలడం హాట్ టాపిక్ గ్గా మారింది. 

అయితే.. ప్రియాంక ఆ ఇంటిని 2019లో ఓ విక్రయదారుడి నుంచి కొనుగోలు చేసింది. ఆ ఇల్లు విలువల రూ.165 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అన్నీ రకాల సౌకర్యాలతో, అత్యాధునికతతో ఇంటిని నిర్మించడం విశేషం. అయినా ఆ ఇంటిని ఎందుకు వీడిందనేది వార్త. 

కాగా, ఆ ఇంటి గోడలు సరిగా లేవని, గోడల నుంచి ఇంటిలోకి నీళ్లు వస్తున్నాయనే కారణంతో ఖాళీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై లీగల్ గా విక్రయదారుడి నుంచి నష్టపరిహారం పొందేందుకు తగిన చర్యలు తీసుకుంటోందంట. తన కలల ఇంటిలో ఇలాంటి పరిణామాన్ని ప్రియాంక జీర్ణించుకోలేకోయింది.

ఇక ఆ ఇంటి విషయానికొస్తే.. ఏడు బెడ్‌రూమ్‌లు, తొమ్మిది బాత్‌రూమ్‌లు, టెంపరేచర్ కంట్రోల్డ్ వైన్ సెల్లార్, చెఫ్ కిచెన్, హోమ్ థియేటర్, బౌలింగ్ అల్లే, స్పా, స్టీమ్ షవర్, జిమ్, బిలియర్డ్స్ రూమ్‌లు ఉన్నాయి. ఇంటిని కొన్న కొద్దిరోజులకే పూల్, స్పా సమస్యలను గుర్తించిందట.. ఇప్పుడు గోడల నుంచి నీటి లీకేజీ కావడంతో ఇంటిని ఖాళీ చేసినట్టు తెలుస్తోంది.  

Latest Videos

click me!