అదిరిపోయే అవుట్ ఫిట్లలో జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్స్.. ఆ విషయంలోనూ ఎన్టీఆర్ భామ తగ్గేదెలే..

First Published | May 18, 2023, 3:23 PM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తాజాగా పంచుకున్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రెసింగ్ తో ఆకట్టుకుంటుంది. తన అందంతో కట్టిపడేసింది.
 

సీనియర్ నటి, దివంగత శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో వరుస ఆఫర్లే దక్కాయి. స్టార్ భామ అందానికి, నటనకు ఆడియెన్స్ లోనూ మంచి మార్కులే పడుతుండటంతో మరిన్ని అకాశాలు దక్కుతున్నాయి. 
 

ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగానే ఉందని తెలుస్తోంది  జాన్వీ కపూర్. అయితే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తో Aldo అనే సంస్థ తమ ప్రాడక్ట్స్ ను ప్రమోట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ అదిరిపోయే అవుట్ ఫిట్లలో యాడ్ షూట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది.


అయితే, ప్రస్తుతం అటు బాలీవుడ్ లో, సౌత్ లో జాన్వీ కపూర్ పేరే వినిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు ఖాయమంటున్నారు. మరోవైపు టాలీవుడ్ లోకి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR) సినిమాతో ఎంట్రీ ఇవ్వడంతోనే కొన్నాళ్లపాటు సౌత్ ను ఏలుతుందని అంటున్నారు. 
 

ఈక్రమంలోనే ఇలా యాడ్ షూట్లకోసం కూడా ఆఫర్లు వస్తున్నాయి. పలు బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటూ ఇలా కొంత సంపాదించుకుంటోంది యంగ్ బ్యూటీ. తాజాగా పంచుకున్న వీడియో వైరల్ గా మారింది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో జాన్వీ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

జాన్వీ లుక్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఆ వీడియోను కామెంట్లు, లైక్స్ తో వైరల్ చేస్తున్నారు. NTR30లో జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ముద్దుగుమ్మ ఎలా అలరిస్తుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ దక్కింది. 
 

మరోవైపు జాన్వీ కపూర్ కు టాలీవుడ్ లోనే వరుస ఆఫర్లు దక్కుతున్నట్టు తెలుస్తోంది. యంగ్ బ్యూటీ క్రేజ్ సౌత్ లోనూ కనిపిస్తుండటంతో మరింతకొంత మంది స్టార్ హీరోల సరసన నటించే అవకాశం ఉందంటున్నారు. రామ్ చరణ్ 16, అఖిల్ అక్కినేని రాబోయే చిత్రాల్లో నటించనుందని తెలుస్తోంది.
 

Latest Videos

click me!