ఆ టైంలో కన్నీరు మున్నీరైన జమున.. మహానటి సావిత్రి కష్టాలు మొత్తం తెలిసినప్పటికీ..

First Published Jan 27, 2023, 10:02 AM IST

అలనాటి నటి జమున మరణ వార్తతో టాలీవుడ్ మొత్తం దిగ్బ్రాంతికి గురవుతోంది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనారోగ్యం కారణంగా జమున హైదరాబాద్ లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం మరణించారు.

అలనాటి నటి జమున మరణ వార్తతో టాలీవుడ్ మొత్తం దిగ్బ్రాంతికి గురవుతోంది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనారోగ్యం కారణంగా జమున హైదరాబాద్ లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం మరణించారు. దీనితో సినీ రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. 

అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎలా అభిమానులకు గుర్తుండిపోయేవారో.. జమున, మహానటి సావిత్రి కూడా అంతే. వీరిద్దరూ మిస్సమ్మ, గుండమ్మ కథ కలాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ లో కలసి నటించిన సంగతి తెలిసిందే. మహానటి సావిత్రితో తన అనుబంధాన్ని జమున ఎప్పుడూ గుర్తు చేసుకునే వారు. సావిత్రి సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి తనకి పూర్తి అవగాహన ఉంది అని జమున అంటుంటారు. 

జెమిని గణేశన్ ని పెళ్లి చేసుకోవడం వల్లే సావిత్రి చివరి రోజుల్లో అన్ని కష్టాలు అనుభవించింది అని జమున గతంలో తెలిపారు. సావిత్రి జీవితంపై బయోపిక్ చిత్రం తెరకెక్కించినప్పుడు చిత్ర యూనిట్ ఆమెని సంప్రదించలేదట. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని జమున బాధపడ్డారు. సినిమా బాగా ఆడింది అని సంతోష పడ్డాను. కానీ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. 

తన పాత్ర లేకుండా సావిత్రి బయోపిక్ ఎలా తీస్తారు అని జమున కన్నీరు మున్నీరు అయ్యారు. మేమిద్దరం అక్కా చెల్లెళ్ళ లాగే ఉండేవాళ్ళం. ఎప్పుడూ ఆమెని సావిత్రి అక్క అని పిలిచేదాన్ని. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది సావిత్రే. ఇండస్ట్రీలో సావిత్రి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. 

అప్పటి తరం హీరోయిన్లలో బ్రతికి ఉన్న నన్ను చిత్ర యూనిట్ సంప్రదించలేదు. పైగా సావిత్రితో నానంత చనువు ఉన్న నటులు ఇంకెవరూ లేరు. సావిత్రి జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని నేను చెప్పగలను అని జమున మహానటి చిత్రం విడుదలైనప్పుడు తెలిపారు. 

jamuna

ఏది ఏమైనా జమున మృతితో అప్పటి తరం కనుమరుగైనట్లే అనిపిస్తోంది. అందం, అభినయం కలబోసిన నటి జమున. గోదారి గట్టుంది గట్టుమీద చెట్టుంది అంటూ మూగమనసులు చిత్రంలో తుళ్లిపడుతూ అభినయించిన జమునని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపలేరు. 

click me!