Jamuna: జమునపై కక్ష గట్టిన ఎన్టీఆర్, ఏఎన్నార్‌.. నాలుగేళ్లు బాయ్‌కాట్‌.. మళ్లీ ఎలా కలిశారంటే?

First Published Jan 27, 2023, 10:51 AM IST

జమునకి కొంత పొగరు, వగరు ఎక్కువ అంటున్నారు. గర్విస్టి అని, పెద్దలంటే పెద్దగా లెక్కచేయదనే ప్రచారం జరిగింది. అయితే దీనికి కారణంగా ఆమెని అగ్ర హీరోలు ఎన్టీఆర్‌, ఏన్నార్‌ బ్యాన్‌ చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి తరం నటీమణుల్లో జమున ఒకరు. వెండితెర సత్యభామగా వెలిగిన ఆమె తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌తో టాలీవుడ్‌నే కాదు, కోలీవుడ్‌, శాండల్‌వుడ్, బాలీవుడ్‌ని కూడా ఓ ఊపు ఊపేసింది. కానీ జమునకి కొంత పొగరు, వగరు ఎక్కువ అంటున్నారు. గర్విస్టి అని, పెద్దలంటే పెద్దగా లెక్కచేయదనే ప్రచారం జరిగింది. అయితే దీనికి కారణంగా ఆమెని అగ్ర హీరోలు ఎన్టీఆర్‌, ఏన్నార్‌ బ్యాన్‌ చేశారు. ఆమెతో సినిమాలు చేయలేదు. తను కూడా వారిని లెక్క చేయక ఆ తర్వాత గ్రేడ్‌ హీరోలతో కలిసి నటించడం విశేషం. 
 

అయితే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకు మండటానికి కారణం ఆమె యాటిట్యూడ్‌. వారి ముందే కాలు మీద కాలేసుకుని కూర్చుందని, తమని గౌరవించడం లేని వారి ప్రధాన కంప్లెయింట్‌.  షూటింగ్‌లకు లేట్‌గా వస్తుందని ఆరోపించారు. స్వతహాగా యాటిట్యూడ్‌కి కేరాఫ్‌ అయిన జమున వీరిని పెద్దగా లెక్కచేయలేదు. దీంతో జమున వ్యవహార సరళి నచ్చలేదనే నెపంతో అక్కినేని, ఎన్టీఆర్‌ ఇద్దరూ జమునతో నటించబోమని ప్రతికాముఖంగా ప్రకటించారు. 
 

అగ్ర హీరోలు, పైగా ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటి వారే ఈ పని చేయడంతో ఇక జమున కెరీర్‌ అయిపోయిందని అంతా అనుకున్నారు. అవి బాయ్‌కాట్‌ చేయాల్సినంతటి సమంజసమైన కారణాలు కావని చిత్రపరిశ్రమకు తెలిసినా అగ్రనటుల ప్రమేయం ఉండడంతో సమస్య పరిష్కారానికి ఎవరూ సాహసించలేదు. అసలు కారణం ఏమిటనేది జమున మనస్సాక్షికి మాత్రమే తెలుసు. ఆ కారణాన్ని ఇప్పటికీ చెప్పకపోవడం ఆమె గొప్పతనం. ఆ దశలో జగ్గయ్య, శోభన్‌బాబు, హరనాథ్‌, కృష్ణ, కృష్ణంరాజు, కాంతారావు వంటి హీరోలతో ఆమె విజయవంతమైన సినిమాలలో నేటించింది. ఆమెకు పరపతి ఏమాత్రం మాత్రం తగ్గలేదు. ఆమెకు ఎప్పుడూ ఐదారు సినిమాలు చేతిలో ఉండేవి. 
 

అదే సమయంలో జమునకు హిందీ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. ఎల్వీప్రసాద్‌ నిర్మించిన ‘హమ్‌ రాహి’(1963), ‘బేటీ బేటే’(1964) సినిమాల్లో జమున నటించింది. విజయా వారు ‘గుండమ్మ కథ’ (1962) సినిమా నిర్మాణానికి పూనుకుంటూ ఎన్టీఆర్‌ సరసన సావిత్రిని, అక్కినేని సరసన జమునను నటింపజేయాలని నిర్ణయించారు. వీరి మనస్పర్థల వలన అప్పటికే ‘గుండమ్మ కథ’ రెండేళ్లు వెనకబడింది. చక్రపాణి, కె.వి.రెడ్డి రాజీయత్నాలు మొదలుపెట్టారు. అగ్రనటులిద్దరికీ క్షమాపణ పత్రం రాసి ఇవ్వమని జమునకు సలహా కూడా ఇచ్చారు. 
 

కానీ జమున ససేమిరా అంది. `చేయని నేరానికి నాలుగేళ్లపాటు హింసపెట్టిన వారికి క్షమాపణ ఎందుకు చెప్పాలి?` అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇక లాభం లేదని చక్రపాణి అక్కినేని, ఎన్టీఆర్, జమున ముగ్గురినీ కూర్చోబెట్టి, చనువుకొద్దీ వారిని మందలించి `అందరూ కలిసి పనిచేయండి. అవతల నా గుండమ్మ ఏడుస్తోంది` అంటూ చమత్కరించి సమస్యను తనదైన శైలిలో పరిష్కారం చేశారు. తర్వాత వీరి కాంబినేషన్‌లో ‘గులేబకావళి కథ’, ’పూజాఫలము’ చిత్రాలు ఘనవిజయం సాధించడంతో వారి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయి. 
 

click me!