Actress Hema: హేమ అనేక పాత్రలలో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం కొంచెం గ్యాప్ తీసుకొని అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తుంది. అయితే ఆమె కూతురి పెళ్లి చేసేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. దీనిపై హేమ ఏం చెబుతుందో తెలుసుకోండి.
తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ. ఆమె సహాయక పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు ఎంతో గుర్తుండిపోతుంది. సాధ్యమైన నటన పాత్రకు తప్ప, హావభావాలు హేమను తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర చేశాయి. ఈమె 1972లో ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. చిన్నప్పటి నుంచే నాటకాలు అంటే ఎంతో ఇష్టం. సినిమాల పై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించింది. ముఖ్యంగా కామెడీ పాత్రల్లో ఆమె నటన ప్లస్ అనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు కొంచెం సినిమాకు బ్రేక్ ఇచ్చి...మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
24
చక్కటి పాత్రలు చేసిన హేమ
ఇప్పటివరకు హేమా హీరోకు తల్లిగా, అక్కగా, వదినగా, పక్కింటి ఆవిడగా ఎన్నో పాత్రల్లో చేసింది. అతడు, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, దూకుడు ఇలా ఎన్నో పాపులర్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బ్రహ్మానందంతో కలిసి అతడు సినిమాలో ఆమె చేసిన కామెడీ ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. అయితే హేమ కూతురి పెళ్లి గురించి ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది. హేమకు ఈషా అనే ఒక కూతురు ఉంది. ఇప్పుడు ఆమె వయసు 23 ఏళ్లు. ఆమెను ఒక స్టార్ హీరో కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై హేమ క్లారిటీని ఇచ్చింది.
34
పెళ్లి ఎప్పుడు చేస్తానంటే..
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ తన కూతురికి కేవలం 23 ఏళ్లేనని... 26 ఏళ్ళు వచ్చాకే పెళ్లి సంబంధాలు చూస్తానని చెప్పింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినా, సినిమా ఇండస్ట్రీ కాకపోయినా మంచి సంబంధం వస్తే చేస్తానని వివరించింది. ప్రస్తుతం తన కూతురు ఉద్యోగం చేస్తోందని ప్రతిరోజు ఆటోలోనే ఆఫీసుకు వెళ్లి వస్తుందని చెప్పంది. తన కూతురికి బిజినెస్ చేయాలని కోరిక ఎక్కువ అని, కానీ తాను మొదట ఉద్యోగం చేయిస్తున్నానని చెప్పింది. ఉద్యోగం చేయడం వల్ల ఒక బాస్ ఎలా పని చేయించుకుంటాడో, పని చేయకపోతే ఎలా తిడతాడో అన్నీ తనకి అనుభవం కావాలనే ఉద్యోగం చేయిస్తున్నట్టు చెప్పింది. అలాగే తమ కింద పనిచేసే వాళ్ళతో పని ఎలా చేయించుకోవాలో కూడా నేర్చుకోవడానికి ఉద్యోగం పనికొస్తుందని చెప్పింది. తన కూతురికి స్టార్ హీరో కొడుకుతో లేదా స్టార్ డైరెక్టర్ కొడుకుతో పెళ్లి అని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చింది. తన కూతురు ఈషాకు వంట పనులన్నీ వచ్చని, తన షూటింగ్ కి ఒక్కోసారి తానే వంట చేసి క్యారేజీ కూడా పెట్టి పంపిస్తుందని చెప్పింది హేమ.
తన భర్త, తాను విడిపోయామంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని అందులో నిజం లేదని చెప్పింది హేమ. తన భర్తకు తనకు పెళ్లి జరిగి పాతికేళ్లు దాటిందని, తనకు అన్ని సందర్భాల్లో అతను అండగా ఉన్నాడని వివరించింది. కేవలం 19 ఏళ్ల వయసులోనే తాను పెళ్లి చేసుకున్నానని, తన భర్త ముస్లిం అని చెప్పింది. తన భర్తకు సినిమా వేడకలకు, పార్టీలకు వచ్చే అలవాటు లేదని, అందుకే ఎక్కడా ఆయన ఎక్కువ కనిపించడని తెలిపింది. తన భర్తను తాను కొడుకులా ప్రేమిస్తానని, భార్యా భర్తలు విడిపోతారు కానీ, తల్లీ కొడుకులకు విడాకులు ఉండవని వివరించింది.