కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ లో నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాతుకుపోయారు. బడా హీరోలు, నిర్మాతలు, దర్శకులు అందరితో ఆమెకి మంచి పరిచయాలు ఉన్నాయి. అత్త, వదిన, తల్లి తరహా పాత్రలు.. కామెడీ టచ్ ఉన్న పాత్రల్లో హేమ నటించడం చూస్తూనే ఉన్నాం. హేమ ఎంత గుర్తింపు తెచ్చుకుందో అదే స్థాయిలో వివాదాలని కూడా మూటగట్టుకుంది.