టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చిరంజీవితో కొన్ని చిత్రాలు చేశారు. కోతల రాయుడు, మొగుడు కావాలి లాంటి చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. తమ్మారెడ్డి మాట్లాడుతూ.. నేను తొలిసారి చిరంజీవిని క్రాంతి కుమార్ గారి ఆఫీస్ లో చూశాను. కుర్రాడు ఒత్తుగా జుట్టు, పెద్ద కళ్ళతో భలే ఉన్నాడు అనిపించింది.