
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’(Pushpa) ప్రపంచస్థాయిలో ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుందో తెలిసిందే. ఇందులో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహాద్ ఫాజిల్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన కు ఇప్పుడు ఓ రేంజిలో డిమాండ్ ఉంది. ఈ నేపధ్యంలో తన డేట్స్ ,రెమ్యునరేషన్ విషయంలో ఆయన ఖచ్చితంగా ఉంటున్నారు. ఎగ్రిమెంట్ రాసుకునేటప్పుడే గమ్మత్తైన కండీషన్ పెట్టారని వినికిడి. అయితే ఆ కండీషన్ తెలిసిన వాళ్లు..ఆ మాత్రం చెయ్యకపోతే ఫహాద్ ఫాజిల్ తో దర్శక,నిర్మాతలు ఆడుకుంటారు అంటున్నారు. ఇంతకీ ఫహాద్ ఫాజిల్ పెట్టిన కండీషన్ ఏమిటి..దానికి రెమ్యునరేషన్ కు లింకేంటో చూద్దాం.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...ఫహాద్ ఫాజిల్ కు పుష్ప సినిమా నిమిత్తం భారీ మొత్తమే ముడుతోంది. అయితే అంత పెద్ద సినిమాలో కీలకమైన పాత్రకు అది పెద్ద విశేషమేమీ కాదు. అయితే ఫహాద్ ఫాజిల్ రెమ్యునరేషన్ ని డైలీ వేజెస్ లెక్క తీసుకుంటున్నారు. అంటే షూటింగ్ ఎన్ని రోజులు అయితే అన్ని రోజులకే ఎమౌంట్ అందుతుందన్నమాట. ఇంతకీ రోజు వారి ఫహాద్ ఫాజిల్ తీసుకునే ఎమౌంట్ ఎంతో తెలిస్తే మతిపోతుంది.
రోజు వారి ఫహాద్ ఫాజిల్ ...12 లక్షలు దాకా తీసుంటారు. ఇది టాలీవుడ్ లో చాలా మంది పెద్ద స్టార్స్ కు ఇచ్చే మొత్తం కన్నా చాలా చాలా ఎక్కువ. అయితే ఇక్కడే మెలిక ఉంది. డేట్స్ తీసుకుని షూటింగ్ చేయకపోతే మరో లక్షలు అదనంగా తీసుకుంటారట. అంటే తనకు డబ్బులు కన్నా తన వర్కింగ్ డేస్ ముఖ్యమని ఫహాద్ ఫాజిల్ చెప్పకనే చెప్తున్నారన్నమాట. అంటే షూటింగ్ కాన్సిల్ అయితే ఆ రోజు ఫహాద్ ఫాజిల్ డేట్స్ ఉంటే 14 లక్షలు పే చెయ్యాలన్నమాట. ఎందుకంటే ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం ఆయన హైదరాబాద్ వస్తారు. ఆ ఖర్చులు , తన స్టాఫ్ ఇవన్నీ షూటింగ్ కాన్సిల్ అయినా తప్పవు కదా అంటున్నారు.
అయితే మొదట నిర్మాతలు దీన్ని వ్యతికేరించారట. కానీ పట్టుబట్టి మరీ ఫహాద్ ఫాజిల్ ఈ ఎగ్రిమెంట్ చేసారట. తన డేట్స్ పొరపాటన కూడా వృధా చేయద్దని క్లియర్ గా చెప్తున్నారట. దాంతో ఫహాద్ ఫాజిల్ తమ సినిమాల్ల ఉంటే నిర్మాతలు చాలా ఎలర్ట్ గా ఉంటారు. అలాగే ఎంతో తప్పనిసరి పరిస్దితి అయితే తప్పించి షూట్ కాన్సిల్ ఉండదు. ఇది ఓ రకంగా నిర్మాతకు సేవ్ చేసేదే.
ఇక రీసెంట్ గా ఫహాద్ ఫాజిల్ తను చేస్తున్న పుష్ప ఈ సినిమాపై చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ‘పుష్ప’ తర్వాత మీకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చిందా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘‘పుష్ప’ తర్వాత నాలో, నా కెరీర్‌లో ఎలాంటి మార్పు రాలేదు. ఇందులో దాచుకోవాల్సిన విషయమేం లేదు. ఇదే సంగతి నేను సుకుమార్‌కు కూడా చెప్పాను. ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు. ఆ చిత్రం తర్వాత నేనేదో మ్యాజిక్ చేస్తానని ప్రేక్షకులు అనుకోవడం లేదు.
ఇప్పుడు మలయాళం తెలియని ప్రేక్షకులు కూడా మలయాళం చిత్రాలు చూస్తున్నారు. అది నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నా మనసంతా మలయాళ చిత్రాలపైనే ఉంటుంది. ‘పుష్ప’ను సుకుమార్ మీద ఉన్న అభిమానంతో చేశాను’’ అని చెప్పారు. ప్రస్తుతం ఆయన ‘పుష్ప2’ (Pushpa2)లో నటిస్తున్నారు. మొదటిభాగంతో పోలిస్తే రెండో పార్ట్‌లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్ ఆగస్టు 15న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ వాయిదా పడే అవకాసం ఉందంటున్నారు.
మరోవైపు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆవేశం’ విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది మలయాళంలో భారీ కలెక్షన్లు సాధించిన సినిమాల వరుసలో చేరింది. రూ.30 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.150కోట్లు వసూలు చేసింది.
వాస్తవానికి పుష్ప పార్ట్ 1 రిలీజ్ నాటికి ఈ క్రేజ్ లేదు..ఈ స్దాయి ఎక్సపెక్టేషన్స్ లేవు. కానీ ఇప్పుడు సీన్ వేరు. ‘పుష్ప ది రైజ్’ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది.. ఈ క్రమంలో ఇప్పుడు అంతా ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ పై భారీగా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. యానిమల్ తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన త్రిప్తి డిమ్రి (tripti dimri)బన్నీ తో కలిసి పుష్ప 2 కి సంబంధించిన ఐటెం సాంగ్ లో చిందులేయనుందని తెలుస్తోంది. మాస్ ఐటెం సాంగ్ దేవి ఇచ్చాడని, థియోటర్స్ ఊగిపోతాయని అంటున్నారు.
ఇక పుష్ప 2 చిత్రానికి ఎలాగో తెలుగు రాష్ట్రాల్లో భీబత్సమైన క్రేజ్ ఉంటుంది. అయితే హిందీ బెల్ట్ లలో మాత్రం ఇంకా క్రేజ్ మొదలు కాలేదు. ఫస్ట్ సాంగ్ డీసెంట్ గా రెస్పాన్స్ వచ్చిందని కానీ ఇనిస్టెంట్ ఛాట్ బస్టర్ కాలేదు. దాంతో ఇంకా అక్కడ పుష్ప 2 ఫీవర్ ప్రారంభం కాలేదు. అందుకోసం నిర్మాతలు ప్రమోషన్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఎలక్షన్స్ ఫీవర్ తగ్గింది కాబట్టి పుష్ప ఫీవర్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది.
పుష్పలో ఐకాన్‌స్టార్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న పుష్ప-2 ది రూల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దుగా అంచనాలు వున్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసారు మేకర్స్ . ఈ టీజర్ లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియస్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపించంటతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.