ఫ్రెండ్స్ తో కలిసి విదేశాల్లో రచ్చ చేస్తున్న హేబా పటేల్.. వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ కుమారి సందడి..

First Published | Jun 5, 2023, 5:29 PM IST

యంగ్ హీరోయిన్ హెబా పటేల్ (Hebah Patel)  ప్రస్తుతం ఫారెన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులతో కలిసి విదేశీ వీధుల్లో రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను పంచుకుంది. 
 

నార్త్ బ్యూటీ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ హెబా పటేల్ ప్రస్తుతం సినిమాల జోరు పెద్దగా కనిపించడం లేదు. వచ్చిన అవకాశాలను మాత్రం సరిగా వినియోగించుకుంటోంది. ఇప్పుడిప్పుడు మళ్లీ వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. 
 

యంగ్ బ్యూటీ ‘కుమారి 21ఎఫ్’తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెప్పుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తూనే ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తో మతులు పోగొట్టింది. ఆ దెబ్బతో కొన్నాళ్లు వరుస తెలుగులో అవకాశాలను అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ లోనూ సినిమాలు చేసింది.
 


ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇందుకు హేబా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా కనిపిస్తూ సందడి చేస్తోంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
 

హేబా పటేల్ ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి ఫారేన్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తోంది. ఫారేన్ వీధుల్లో తిరుగుతూ రచ్చ చేస్తోంది. తాజాగా ఓ హోటల్ ను విజిట్ చేసిన సందర్భంగా చిలిపిగా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలనే ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. 
 

ఇప్పుడిప్పుడే మళ్లీ ఈ ముద్దుగుమ్మ వరుస గా అవకాశాలను అందుకుంటోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఇలా ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూ సందడి చేస్తోంది. గ్లామర్ ఫొటోలను కూడా షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 
 

రీసెంట్ గా హేబా ‘వ్యవస్థ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు ‘శాసనసభ’ అనే చిత్రంలో స్పెషల్ సాంగ్ తో అలరించింది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ అవకాశాలనూ వదులుకోవడం లేదు. తెలుగుతో పాటు ప్రస్తుతం తమిళంలోనూ చిత్రాలు చేస్తోంది.
 

Latest Videos

click me!