నేడు సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ వివాహం కనుల పండుగలా గ్రాండ్ గా జరిగింది. అభిషేక్ అంబరీష్.. అవివా బిదప అనే ఎంట్రపెన్యూర్ మోడల్ ని వివాహం చేసుకున్నాడు.
సీనియర్ నటి సుమలత సౌత్ లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ఆమె 80, 90 దశకాల్లో హీరోయిన్ గా నటించారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు పొందారు.
28
ముఖ్యంగా సుమలత మెగాస్టార్ చిరంజీవితో కలసి శుభలేఖ, ఖైదీ, చట్టంతో పోరాటం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆమె 1991లో కన్నడ దివంగత నటుడు అంబరీష్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అభిషేక్ అంబరీష్ సంతానం.
38
సుమలత భర్త అంబరీష్ 2018లో మరణించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సుమలత రాజకీయాల్లో సైతం రాణిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.
48
ఇదిలా ఉండగా నేడు సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ వివాహం కనుల పండుగలా గ్రాండ్ గా జరిగింది. అభిషేక్ అంబరీష్.. అవివా బిదప అనే ఎంట్రపెన్యూర్ మోడల్ ని వివాహం చేసుకున్నాడు. వేద మంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు.
58
చూడముచ్చటగా ఉన్న ఈ జంట పెళ్లి ఫోటొలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవ వధూవరులు ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోతున్నారు.
68
అంబరీష్ ఫ్యామిలీకి సౌత్ లో దాదాపు స్టార్ హీరోల ఫ్యామిలీస్ అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. అంబరీష్ లెజెండ్రీ నటుడిగా వెలుగు వెలిగారు. ఆ అనుబంధంతో సౌత్ నుంచి చాలా మంది స్టార్ హీరోలు, పొలిటిషియన్లు సుమలత కుమారుడి వివాహానికి హాజరయ్యారు.
78
సూపర్ స్టార్ రజనీకాంత్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కెజిఎఫ్ హీరో యష్, కిచ్చా సుదీప్, మోహన్ బాబు, రఘురామ కృష్ణంరాజు లాంటి వారంతా పెళ్ళిలో సందడి చేశారు.
88
జంట చూడముచ్చటగా ఉందని అభిమానులు కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఈ పెళ్లి వేడుకకి పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని కూడా హాజరయ్యారు.