టాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన హన్సిక మెత్వానీ తక్కవ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై అలరించిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయస్సులోనే హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
‘దేశముదురు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందం, నటన, డాన్స్ తో కట్టిపడేసింది. తొలిచిత్రంతోనే హిట్ అందుకున్న హన్సిక టాలీుడ్ లో కొన్నేండ్ల పాటు ఊపూపింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఫుల్ బిజీగా ఉంది.
గతేడాది తన స్నేహితుడు, బిజినెస్ మెన్ సోహెల్ కతురియాను పెళ్లిచేసుకుంది. డిసెంబర్ 4న జైపూర్ లోని మండోట ఫోర్ట్ లో అంగరంగవైభంగా వివాహ వేడుక జరిగింది. పెళ్లి తర్వాత నుంచి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మరింత యాక్టిగా కనిపిస్తోంది. కేరీర్ లోనూ చాలా యాక్టివ్ అయ్యింది.
ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం కేరీర్ పరంగానూ ఫుల్ బిజీగా ఉన్న హన్సిక ఆయా ఈవెంట్లకు కూడా హాజరవుతూ సందడి చేస్తోంది. తాజాగా ముంబైలో నిర్వహించిన ‘జీక్యూ మోస్ట్ ఇన్ ఫ్ల్యూయేన్షియల్ యంగ్ ఇండియన్ అవార్డ్స్’ వేడుకలో పాల్గొంది.
ఈ సందర్భంగా క్రీమ్ కలర్ ట్రౌజర్, ఫర్ట్ ధరించింది. జాలీ టైప్ లో ఉన్న ఆ అవుట్ ఫిట్ హన్సికకు స్టైలిష్ గా కుదిరింది. అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా క్రేజీగా ఫొటోషూట్ కూడా చేసింది. ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది.
మొన్నటి వరకు గ్లామర్ విందుతో రచ్చ చేసిన హన్సిక ఇలా స్టైలిష్ గా మెరిసి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. యాపిల్ బ్యూటీ నయా లుక్ కు, అదిరిపోయే ఫోజులకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక తెలుగులో ‘105 మినిట్స్’, ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో మరో మూడు చిత్రాలు చేస్తోంది.