‘ఆదిపురుష్’ ట్రైలర్ సిద్ధం.. రంగంలోకి దిగుతున్న ప్రభాస్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

First Published | Apr 27, 2023, 2:51 PM IST

డార్లింగ్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ (Adipurush) నుంచి త్వరలో బిగ్ అప్డేట్ అందనుంది. ట్రైలర్ విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. చిత్ర ట్రైలర్ కట్, తదితర అంశాలు ఆసక్తికరంగా మారాయి. 
 

పాన్ ఇండియా  స్టార్ ప్రభాస్ (Prabhas) - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషనల్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. హిందూ మైథాలజికల్ ఫిల్మ్ గా రామాయణం ఆధారంగా రూపుదిద్దుకుంది.  చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు, ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈచిత్రం నాసిరకమైన గ్రాఫిక్స్, విజువల్స్ కారణంగా వాయిదా పడింది. 
 

గతంలో విడుదల చేసిన ట్రైలర్ పై చాలా విమర్శలు వచ్చాయి. భారీ అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం ట్రైలరే ఆకట్టుకోలేకపోయింది. దీంతో మరింత సమయం  తీసుకొని బెస్ట్ అవుట్ పుట్ కోసం శ్రమించారు. ఎట్టకేళకు జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా ఫిల్మ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు.  
 


శ్రీరామనవమి సందర్భంగా విడుదలై పోస్టర్, రీసెంట్ గా వచ్చిన మోషన్ పోస్టర్, జైశ్రీరామ్ సాంగ్ సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందించేందు సిద్ధం అవుతున్నారు. ఈక్రమంలోనే ‘ఆదిపురుష్’ కొత్త ట్రైలర్ పై  అప్డేట్ అందింది. ట్రైలర్ కట్ అదిరింది అంట. మొత్తం 3 నిమిషాల 22 సెకండ్స్ రన్ టైంతో రానుందని తెలుస్తోంది. 

200 సెకండ్ల పాటు అరాచకం అని అంటున్నారు. ట్రైలర్ కట్ ని ఇప్పటికే కొందరికి చూపించారంట కూడా. అదిరిపోయిందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ సైతం ఈ చిత్రం ప్రమోషన్స్ కు సమయం కేటాయించినట్టు తెలుస్తోంది. ఏకంగా 40 రోజుల పాటు ప్రచార  కార్యక్రమాలను నిర్వహించబోతున్నారని టాక్.  

ఇలోగా  ప్రభాస్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అయిన Salaar, Project K చిత్ర షూటింగ్స్ లో పాల్గొననున్నారు. మే మొదటి వరం కల్లా సలార్ షూట్ అయిపోతుందని టాక్. ఆ తరువాత ప్రభాస్ ప్రొమోషన్స్ కి టైం కేటాయిస్తారు. అప్పుడే ‘ఆదిపురుష్’ ట్రైలర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 2డీ, 3డీలో రానుంది. మే రెండో వారంలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో ఏప్రిల్ 29న సీతాదేవీకి సంబంధించిన అప్డేట్ అయినా, లేదంటో మరో సాంగ్ అయినా వచ్చే అవకాశం ఉందంటున్నారు. 
 

రూ.600  కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం మరోవైపు ప్రముఖ ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ప్రీమియర్ కానుంది. విడుదలకు మూడు రోజుల ముందే ప్రదర్శన జరుగుతుంది. ఆసయమంలోనే ఆదిపురుష్ టాక్ కూడా బయటికి రానుంది. చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించనున్నారు. సైఫ్ అలీఖాన్ రావణసురుడిగా అలరించబోతున్నారు. టీ-సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.  
 

Latest Videos

click me!