అదిరిపోయే అవుట్ ఫిట్ లో.. హన్సిక అందాల రచ్చ.. యాపిల్ బ్యూటీ మత్తు ఫోజులకు గుండెలు గల్లంతే..

First Published | Aug 26, 2023, 2:58 PM IST

టాలీవుడ్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani)  అదిరిపోయే అవుట్ ఫిట్ లో మెరిసింది. కిర్రాక్ ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. గ్లామర్ మెరుపులతో మంత్రముగ్ధులను చేసింది.
 

స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం తను నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడంతో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. 
 

తాజాగా యాపిల్ బ్యూటీ డిఫరెంట్ అవుట్ ఫిట్ లో మెరిసింది. ధోతీలాంటి లెహంగా, వైట్ టాప్, జాకెట్ ధరించి ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. నయా లుక్ లో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మైమరిపించింది. ఇక కిర్రాక్ స్టిల్స్ తో ఫొటోషూట్ కూడా చేసింది.


తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మత్తెక్కించే ఫోజులకు మైమరిచిపోతున్నారు. హన్సికా అందాల ప్రదర్శనకు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా లైక్స్, కామెంట్లు పెడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

ఇక  హన్సికా గతంతో పోల్చితే ప్రస్తుతం చాలా బరువు తగ్గారు. స్లిమ్ గా మారిన నెట్టింట అందాల విందు చేస్తున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ ఫ్యాన్స్ ను మరింతగా ఆకట్టుకుంటున్నారు. స్లిమ్ ఫిట్ స్ట్రక్చర్ తో మెస్మరైజ్ చేస్తోంది. 

దేశముదురు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. టాలీవుడ్ బడా హీరోల సరసన నటించి మెప్పించింది. నటనతోనే కాకుండా తన అందంతోనూ ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ దక్కించుకుంది.
 

తెలుగు, తమిళంలో ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలు చేసింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన హన్సిక వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘పార్ట్ నర్’ చిత్రం విడుదలైంది. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 

ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హన్సికా నెట్టింట చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుసగా స్టన్నింగ్ ఫొటోషూట్లతో దర్శనమిస్తూ కొత్త లుక్స్ లో మెరుస్తూ  మంత్రముగ్ధులను చేస్తోంది. కిర్రాక్ ఫొటోషూట్లతో కుర్ర గుండెల్ని గల్లంతు చేస్తోంది. 
 

ప్రస్తుతం హన్సికా తెలుగు, తమిళంలో కలిపి ఐదారు చిత్రాల్లో నటిస్తోంది. నెక్ట్స్ తెలుగులో ‘105 మినిట్స్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ‘మై నేమ్ ఈజ్ శృతి’, ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘గాంధారి’ ‘మ్యాన్’ వంటి సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. 
 

Latest Videos

click me!