పెళ్ళి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్ మేఘ ఆకాశ్.. ? వరుడు ఎవరంటే..?

First Published | Jun 8, 2023, 4:38 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్ళి బాజాలు మెగుతున్నాయి. హీరోలు, హీరోయిన్లు, ఓ ఇంటివారు అవుతున్నారు. ఆమధ్య శర్వానంద్ పెళ్లి ఘనంగాజరిగింది. ఇక రేపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాను ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్ మెంట్ కు రెడీ అవుతున్నారు. ఇక మరో హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. 

వరుసగాసినిమా పరిశ్రమలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. మొన్ననే యంగ్ హీరో శర్వానంద్ ఘనంగా పెళ్ళి చేసుకున్నారు. ఇక రేపు మెగా ఇంట నిశ్చితార్ధాల హడావిడి ఉంది. చాలా కాలంగా వినిపిస్తున్న రూమర్ ను నిజం చేస్తూ.. తాను ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. 

ఇక తాజాగా టాలీవుడ్ కు సబంధించిన మరో హీరోయిన్ మేఘ ఆకాశ్ కూడా పెళ్ళి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. నితిన్‌ హీరోగా వచ్చిన లై సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది చెన్నై సుందరి మేఘా ఆకాశ్‌ . ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. . ఆ తర్వాత హిందీ, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది మేఘ. 


ఇక ఈ ఏడాది తెలుగులో రవితేజ నటించిన రావణాసురలో ఒక హీరోయిన్ గా నటించింది మేఘ. అయితే ఈసినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో కాస్త నిరాశపడింది బ్యూటీ. కాని హిట్ ప్లాప్ సంబంధం లేకుండా. సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది బ్యూటీ. ఇక మేఘ ఆకాశ్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
 

 ఈ భామ వ్యక్తిగత జీవితంలో కీలక అడుగు వేయనుందట. మేఘా ఆకాశ్‌ త్వరలో  పెళ్లి  పీటలెక్కనుందన్న వార్త  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు పొలిటిక్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇంటికి కోడలిగా వెళ్లబోతోందట మేఘఆకాశ్.   ప్రముఖ రాజకీయవేత్త కుమారుడిని మేఘా ఆకాశ్‌ వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 

అయితే దీనిపై మేఘా ఆకాశ్‌ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. మరి పెళ్లి వార్తలు పుకార్లేనా..? నిజమా..? అనే దానిపై మేఘా ఆకాశ్‌ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.మేఘా ఆకాశ్ ప్రస్తుతం శివ కందుకూరి నటిస్తోన్న మను చరిత్రలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. భ‌ర‌త్ పెద‌గాని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుద‌లైన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక  తెలుగులో మరో సినిమాతోపాటు తమిళంలో కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తోంది బ్యూటీ.

Latest Videos

click me!