అమ్మమ్మ తాతల కోసం ఆడాలి.. పవిత్ర-నరేష్‌ `మళ్లీ పెళ్లి`టీజర్‌పై పేలుతున్న సెటైర్లు.. ఆస్కార్‌ గ్యారంటీ..

Published : Apr 21, 2023, 02:35 PM ISTUpdated : Apr 21, 2023, 04:06 PM IST

పవిత్ర లోకేష్‌, వీకే నరేష్‌ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ముదురు ప్రేమలతో నిత్యం హాట్‌ టాపిక్‌ అవుతున్నారు. వీరిద్దరు కలిసి నటించిన `మళ్లీపెళ్లి` టీజర్‌ వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ట్రోలర్స్ ఆడుకుంటున్నారు.  

PREV
16
అమ్మమ్మ తాతల కోసం ఆడాలి.. పవిత్ర-నరేష్‌ `మళ్లీ పెళ్లి`టీజర్‌పై పేలుతున్న సెటైర్లు.. ఆస్కార్‌ గ్యారంటీ..

నటి పవిత్ర లోకేష్‌, సీనియర్‌ నటుడు వీకే నరేష్ ఇప్పుడు ఇటు తెలుగులో, ఆటు కన్నడలో హాట్‌ టాపిక్‌ అవుతున్నారు. గత ఏడాది నుంచి వీరిద్దరు కలిసి తిరగడం, నరేష్‌ భార్య రమ్యరఘుపతి ఆయనపై అనేక ఆరోపణలు చేయడం, గొడవలు జరగడం వంటి సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. దీనికితోడు నరేష్, పవిత్ర లోకేష్‌ కలిసి తిరగడం మరింత హీటెక్కిపోతుంది. 
 

26

అయితే చాలా కాలంగా పవిత్రతో కలిసి నరేష్‌ సహజీవనం చేస్తున్నారని తెలుస్తుంది. తన మూడో భార్య రమ్యరఘుపతి నుంచి విడాకులు రాగానే తాను పవిత్రని పెళ్లి చేసుకుంటాడని వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంలోనే నరేష్‌కి, రమ్యరఘుపతికి గొడవలు జరుగుతున్నాయి. అవన్నీ కాదని, ఆ మధ్య నరేష్‌, పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. కొత్త ఏడాది సందర్భంగా కేక్‌ కట్‌ చేసి తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. ఏకంగా లిప్‌ కిస్‌ కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకి పెళ్లి అయిపోయినట్టుగా ఓ వీడియోని పంచుకున్నారు. 
 

36

కానీ ఇది సినిమా కోసం ఆడిన డ్రామా అని, సినిమాలోని సీన్లు అని తర్వాత లీక్‌ అయ్యింది. ఆ లీక్‌ని నిజం చేస్తూ `మళ్లీ పెళ్లి` అంటూ సినిమాని ప్రకటించారు ఈ జోడి. ఎంఎస్‌ రాజు దీనికి దర్శకుడు. నరేష్‌ తన విజయ్‌కృష్ణ మూవీస్‌ పతాకాలపై ఎంఎస్‌రాజుతో కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా టీజర్ విడుదలైంది. ఇందులో తన రియల్‌ లైఫ్‌ని ఆవిష్కరించారు. తన భార్యతో గొడవలు, ఆ తర్వాత ఈ ఇద్దరు పెళ్లి ఎంజాయ్‌ చేయడం వంటివి చూపించారు. చివరగా ఇద్దరు కన్నుకొట్టుకోవడం హైలైట్‌గా నిలిచింది. 
 

46

టీజర్‌ ఆకట్టుకున్నా, టీజర్‌లో ఈ ఇద్దరు చేసిన పనులు, వారి రియల్‌ లైఫ్‌ సన్నివేశాలను సినిమాలో చూపించడంతో నెటిజన్ల నుంచి సెటైర్లు పేలుతున్నాయి. ట్రోలర్స్ కి మంచి స్టఫ్‌ దొరికినట్టయ్యింది. దీంతో ఇంటర్నెట్‌లో నరేష్‌ పవిత్రలను ఆడుకుంటున్నారు. సెటైర్లు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా నరేష్‌, పవిత్ర కన్నుకొట్టుకునే సీన్‌ అరాచకం అని, వేరే లెవల్‌ అని అంటున్నారు. `బాబోయ్‌ చచ్చిపోవాలనిపిస్తుందంటూ` బ్రహ్మానందం సీన్లు పెట్టి మీమర్స్ రెచ్చిపోతున్నారు. 
 

56

ఇక కామెంట్లు చూస్తే, `మంటల్లో చలి కాగడం అంటే ఇదేనేమో, ఎదా ప్రజలు, తదా సినిమాలు`, `మీరు చేసిన ఎదవ పనులను సినిమాలో చూపించడం కేక` అని, `మన పరువు మనమే ఎలా తీసుకోవాలో నేర్పిస్తున్నార`ని, `బాగా బరితెగించిర్రా మీరు.. నాయాల్ది కత్తి అందుకో జానకి` అంటూ కృష్ణంరాజు సినిమా డైలాగులు వదులుతున్నారు. అమ్మమ్మ, తాతల కోసం ఈ సినిమా హిట్‌ కావాలని, జోడీ నెంబర్‌ వన్‌ అని, ఈ సినిమా ఆస్కార్‌కి పంపించాల్సిందే అని, `పవిత్ర, నరేష్‌ల ఒక ఓయో రూమ్‌ కథ` అని ఇలాంటివి మరిన్ని రావాలని, కరువులో ఉన్న బ్యాచ్‌లర్స్ కోరుకుంటున్నారని కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 
 

66

అంతేకాదు `బలగం` సినిమా చూపించినట్టు ప్రతి ఊర్లో దీన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాలని డిమాండ్‌ చేస్తున్నారు.ఇంకొందరు మరింత బూతులతో ఆడుకుంటున్నారు. మొత్తంగా నరేష్‌, పవిత్రల `మళ్లీ పెళ్లి` టీజర్‌ని రచ్చ రచ్చ చేస్తున్నారు. ట్రోల్స్, మీమ్స్, వైరల్ సీన్లతో ఇప్పుడు `మళ్లీ పెళ్లి` టీజర్‌ ఇంటర్నెట్‌ని ఊపేస్తుండటం విశేషం. మొత్తానికి దర్శకుడు ఎంఎస్‌ రాజు ఫ్రీగా పబ్లిసిటీ కొట్టేస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories