చీరకట్టులో మెరిసిపోతున్న తెలుగు అందం.. క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న ఈషా రెబ్బా!

First Published | Feb 23, 2023, 2:45 PM IST

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతోంది. చీరకట్టులో మరింత అందాన్ని సొంతం చేసుకొని కుర్ర హృదయాలను కట్టిపడేస్తోంది. తాజాగా పిక్స్ లో ఆకట్టుకుంటోంది. 
 

యంగ్ బ్యూటీ, తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా అభిమానులను ఆకట్టుకుంటున్నారు. క్రేజీ పోస్టులతో నెటిజ్లన్లతో పాటు ఫ్యాన్స్  ను ఖుషీ చేస్తోంది. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ కట్టిపడేస్తోంది. 
 

అదిరిపోయే అవుట్ ఫిట్లతో అందాల విందు చేస్తూనే సంప్రదాయ దుస్తుల్లోనూ మెరుస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు ఆకర్షణీయంగా ఉన్నాయి. 
 


తాజాగా ఈ తెలుగు హీరోయిన్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతోంది. చీరకట్టులో మరింత అందాన్ని సొంతం చేసుకొని కుర్ర హృదయాలను కట్టిపడేస్తోంది. శారీలో హోయలు పోతూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంది. 

లూజ్ హెయిర్ లో ఆకర్షణీయంగా కనిపించే శారీలో ఈషా రెబ్బా.. చిరు నవ్వుతో యువతను చిత్తు చేసింది. సోషల్ మీడియాలో మాత్రం మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఇలా ఆకట్టుకుంటూ యూత్ ను తన వైపు తిప్పుకుంటుంది.
 

ఈషా పంచుకునే పోస్టులకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. యంగ్ బ్యూటీ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఇక ఈషా పదేండ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది. 

ఇప్పటి వరకు చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే.. స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలను పోషిస్తోంది. ఆశించిన మేర రిజల్డ్ అందుకోకపోవడంతో తమిళ చిత్రాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!