చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించాలని కలలు కన్న చాలా మంది నటీమణులలో దివ్యవాణి ఒకరు. చిరంజీవి సినిమాల విషయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలని దివ్య వాణి వివరించారు.
మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించాలని ప్రతి నటీమణి కోరుకుంటారు. చిరంజీవి సినిమాల్లో ఇతర పాత్రల్లో ఛాన్స్ వచ్చినప్పటికీ వాటిని రిజెక్ట్ చేసి హీరోయిన్ గా అయితేనే చేస్తాం అని భీష్మించుకుని కూర్చున్న నటీమణులు కూడా ఉన్నారు. పెళ్లి పుస్తకం, లేడీస్ స్పెషల్, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ లాంటి క్లాసిక్ హిట్స్ లో నటించిన దివ్యవాణి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
25
ఎయిర్ పోర్ట్ లో చిరంజీవి గారిని కలిశా
చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించాలని చాలా కోరుకున్నా. ఓసారి అవకాశం వచ్చి చేజారింది. ఒకసారి చిరంజీవి గారు ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. వెంటనే మా అమ్మ.. అదిగో చిరంజీవి గారు త్వరగా పరిగెత్తుకుని వెళ్ళు. ఆయనతో మాట్లాడు, ఆయన సినిమాల్లో నీకు హీరోయిన్ గా ఛాన్స్ వస్తుంది అని చెప్పింది. నేను వెంటనే వెళ్లి చిరంజీవి గారిని పలకరించి మాట్లాడాను.
35
చిరంజీవి ఇచ్చిన కాంప్లిమెంట్
సార్ మీ సినిమాలో హీరోయిన్ గా నటించాలని ఉంది అని రిక్వస్ట్ చేశా. అప్పుడు ఆయన నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు నీకేవమ్మా.. హిట్ చిత్రాల నటివి అని అన్నారు. అది నా కెరీర్ లో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఆ టైంలో పెళ్లి పుస్తకం, లేడీస్ స్పెషల్ లాంటి వరుస హిట్లు ఒకే ఏడాది నాకు దక్కాయి. అందుకే చిరంజీవి గారు నాకు ఆ కాంప్లిమెంట్ ఇచ్చారు.
ఆ తర్వాత చిరంజీవి గారి ఘరానా మొగుడు సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది. చాలా సంతోషించా. వాణి విశ్వనాధ్ చేసిన రోల్ నాదే. కానీ చివరి నిమిషంలో ఏమైందో ఏమో తెలియదు ఆ పాత్ర వాణి విశ్వనాధ్ కి వెళ్ళింది. కారణాలు నాకు కూడా తెలియదు. ఆ టైంలో నా డేట్స్ కూడా ఉన్నాయి. అందంగా ఉంటాను, చిరంజీవికి సరైన జోడీగా అనిపిస్తాను. ఒడ్డు పొడుగు ఉంటాను. అయినా ఎందుకు మిస్ అయిందో తెలియదు అని దివ్య వాణి అన్నారు.
55
ఐకానిక్ సాంగ్ నేను చేయాల్సింది
కొండవీటి దొంగ సినిమాలో మాత్రం చిరంజీవి మరదలిగా చిన్న పాత్రలో నటించాను. వాస్తవానికి ఆ మూవీలో ఐకానిక్ సాంగ్ 'శుభలేఖ రాసుకున్న' అనే పాట నాకు చిరంజీవి మధ్య ఉండాల్సింది. స్క్రిప్ట్ లో మా ఇద్దరి కోసమే ఆ సాంగ్ పెట్టారు. కానీ చివరి నిమిషంలో ఆది రాధా గారికి వెళ్ళిపోయింది అని దివ్య వాణి తెలిపారు.