యంగ్ బ్యూటీ దివి వాద్త్యా పేరు మారుమోగిపోతోంది. బిగ్ బాస్ 4 తో వెలుగులోకి వచ్చిన ఈ భామ టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే దివికి అవకాశాలు వస్తున్నాయి. కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఇటీవల దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ వాల్యూమ్ 1 కి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది.
Divi Vadthya పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. ఇటీవల బిగ్ బాస్ షోలో దివి, మోనాల్ గజ్జర్ ఇద్దరూ కలసి హాట్ డాన్స్ తో అదరగొట్టారు.
తాజాగా మరోసారి దివి డాన్స్, ఘాటు అందాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఓ అవార్డు వేడుకలో దివి డాన్స్ పెర్ఫామెన్స్ అందించింది. కళ్ళు జిగేల్ మనే రెడ్ డ్రెస్ లో దివి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా అందాలు ఆరబోస్తూ డాన్స్ చేసింది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దివి థైస్, బెల్లీ అందాలతో కుర్రాళ్లకు నిద్ర కరువు చేస్తోంది.
ఇక దివి తన గ్లామర్ తో అప్పుడే రికార్డులు కూడా కొట్టేస్తోంది. 'హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ వుమెన్' గా 2020 టివి విభాగంలో విజేతగానిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత అందుకోవడంపై దివి సంతోషం వ్యక్తం చేసింది.