సముద్రపు ఒడ్డున తెలుగు అందం.. ట్రెండీ వేర్ లో అట్రాక్ట్ చేస్తున్న డింపుల్ హయాతీ

First Published | Jul 12, 2023, 1:15 PM IST

తెలుగు హీరోయిన్ డింపుల్ హయాతీ (Dimple Hayathi)  ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా బీచ్ లో  దర్శనమచ్చింది. ట్రెండీ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

యంగ్ బ్యూటీ  డింపుల్ హయతీ సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ట్రెండీ వేర్ లో దర్శనమిచ్చినా.. ట్రెడిషనల్ వేర్ లో మెరిసినా గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా మాత్రం నిండు దుస్తుల్లో కనిపించింది.
 

ప్రస్తుతం డింపుల్ వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా మియామీ బీచ్ లో సందడి చేసింది. సముద్రపు ఒడ్డున అలలను చూస్తూ రిలాక్స్ అయ్యింది. ఈ సందర్భంగా ఫొటోలకు క్యూట్ గా ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. 
 


లేటెస్ట్ ఫొటోస్ లో హయాతీ ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. వైట్ హుడీ, టైట్ డెనీమ్ జీన్స్ లో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ స్టిల్స్ ఇస్తూ ఆకట్టుకుంది. అలాగే క్యూట్ సెల్ఫీతోనూ కట్టిపడేసింది. 

ఇదిలా ఉంటే..  తెలుగు హీరోయిన్ గా డింపుల్ హయాతీ టాలీవుడ్ లో ఆఫర్లు అందుకుంటోంది. మొన్నటి వరకు వరుస చిత్రాలతో సందడి చేసింది. మాస్ మహరాజా సరసన ‘ఖిలాడీ’లో నటించి మంచి సక్సెస్ ను అందుకుంది.
 

ఆ తర్వాత ‘రామబాణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపీచంద్ సరసన నటించింది. అయితే ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం తర్వాత నెక్ట్స్ సినిమాపై ఇప్పటి వరకు అప్డేట్ ఇవ్వలేదు. మున్ముందు ఎలాంటి చిత్రంలో నటిస్తోందో చూడాలి మరీ.

ఇక రీసెంట్ గా ట్రాఫిక్ పోలీసులతో వివాదంతోనూ డింపుల్ పేరు నెట్టింట మారుమోగింది. ఆ ఘటన తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం  ఆయా ప్రదేశాలకు వెళ్తూ రిలాక్స్ అవుతోంది. 

Latest Videos

click me!