చిన్నవయస్సులోనే ఇండస్ట్రీలోకి వచ్చింది కలర్స్ స్వాతి. కలర్స్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ఆతరువాత హీరోయిన్ గా మారి.. వరుస ఆపర్లు కొట్టేసింది. కలర్స్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన స్వాతి కలర్స్ స్వాతిగా మారిపోయింది. కెరీర్ బిగినింగ్ లో యాంకర్ గా రాణించిన స్వాతి. ఆతరువాత.. క్యారెక్టర్ ఆర్టిస్ట్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ ను చూపిస్తూ.. దూసుకెళ్ళింది.
కలర్స్ స్వాతి కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన డేంజర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా తరువాత టైర్ 2 హీరోల సరసన హీరోయిన్ గా వరుస సినిమాలు చేసింది బ్యూటీ. అష్టా చమ్మ సినిమాలో నానీ జోడీగా నటించి మెప్పించింది. తర్వాత విక్టరీ వెంకటేష్ మరియు త్రిష కాంబినేషన్ లో తెరకెక్కిన ఆడువారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో హీరోయిన్ చెల్లెలుగా డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది.
ఇటు అష్టా చమ్మలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్వాతికి తమిళంలో కూడా మంచి మంచి ఆఫర్లు అందాయి. ఒకరకంగా చెప్పాలంటే..తెలుగు హీరోయిన్లను టాలీవుడ్ పట్టించుకోకపోయినా.. తమిళంలో వారికి మంచి ఆదరణ లభించింది.కలర్స్ స్వాతి కూడా అంతే.. తమిళం లో సుబ్రమణ్య పురం అనే చిత్రం లో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ ని అందుకుంది కలర్స్ స్వాతి.
వరుసగా క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీ లోకి దూసుకెళ్లింది కలర్స్ స్వాతి. టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించింది. నిఖిల్ జోడీగా ఆమె నటించిన స్వామిరార సినిమాకు కలర్స్ స్వాతికి అభిమానులు పెరిగిపోయారు. ఇక ఈక్రమంలోనే సినిమాలు తగ్గడంతో.. పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయ్యింది స్వాతి. పెళ్లి తర్వాత సినిమాలు మానేసి..ఫ్యామిలీ ని చూసుకుంటే గడిపేసింది లర్స్ స్వాతి.
తాజాగా సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. . రీ ఎంట్రీ లో తన ఇమేజ్ కు తగ్గట్టు.. మంచి మంచి సినిమాలుచేయాలి అనుకుంటుందట. అలాగే సెలక్ట్ చేసుకుంటుంది కూడా. అయితే రీ ఎంట్రీ సందర్భంగా సోషల్ మీడియా ఛానల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది స్వాతి. ఆ ఇంటర్వ్యూలలో ఇంట్రెస్టింగ్ విషయాలు శేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కొత్తలో తనకు ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.డేంజర్ సినిమా చేస్తున్న సమయం లో అల్లరి నరేష్ గారు నాతో కంగారు గా నీకు సంబంధించి ఎదో యం.యం.ఎస్ వచ్చింది చూసావా అని ఒక వీడియో చూపించాడు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు మనుషుల మీద విరక్తి కలిగింది. ఛీ ఛీ ఇండస్ట్రీ అంటే ఇంత వరస్ట్ గా ఉంటుందా అని బాధపడ్డానంటోంది.
అంతే కాదు అది చూసి సినిమాలు అప్పటికప్పుడే మానేద్దాం అనుకున్నాను.. ఇక పై సినిమాలు చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నాను. కానీ నా స్నేహితులు ఇచ్చిన ధైర్యం, పెద్ద పెద్ద స్టార్లకే ఇలాంటివి తప్పడంలేదు.. అని వాళ్లు దైర్యం చెప్పడం వల్ల మళ్ళీ సినిమాలను కొనసాగించాను’ అంటూ చెప్పుకోచ్చింది కలర్స్ స్వాతి. ప్రస్తుంతం సోషల్ మీడియా లో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.