బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులోనూ ఈ హాట్ బ్యూటీ సినిమాలు చేసింది. వెంకటేశ్, బాలయ్య సరసన నటించి మెప్పించింది. హిందీలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.
ఇక కత్రినా కైఫ్ పెళ్లి తర్వాత చాలా మారిపోయింది. మునుపటిలాగా సినిమాలకు సైన్ చేయడం లేదు. భారీ చిత్రాల్లోనే నటిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఎలాంటి హాట్ ఫొటోషూట్లను పోస్ట్ చేయడం లేదు. అన్నింటికి కాస్తా దూరమై ఫ్యామిలీతో ఉంటోంది.
నెట్టింట దర్శనమిచ్చినా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తోంది. ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లెహంగా వోణీలో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తోంది. కత్రినాను ఇంత పద్ధతిగా చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
అయితే, కత్రినా దీవాళి సందర్భంగా ఇలా పద్ధతిగా మెరిసింది. లెహంగా వోణీలో కట్టిపడేసింది. ఎంత సంప్రదాయంగా మెరిసినా మతులు పోయేలా ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ సందర్భంగా తాజా ఫొటోస్ ఆకట్టుకున్నాయి.
సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిన కత్రినా మరోవైపు మత్తు చూపులతో మైమరిపించింది. నిషా కళ్లతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. స్లిమ్ ఫిట్ అందాలతోనూ లెహంగా వోణీలో అదరగొట్టింది. ఫ్యాన్స్ ఈ ముద్దుగుమ్మ లుక్ కు ఫిదా అవుతున్నారు. కామెంట్లతో ఆకాశానికి ఎత్తుతున్నారు.
ప్రస్తుతం కత్రినా కైఫ్ ‘టైగర్ 3’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సల్మాన్ ఖాన్ కు జోడీగా నటించిన ఈ యాక్షన్ ఫిల్మ్ మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా అదరగొడుతోంది. రెండ్రోజుల్లో రూ.100 కోట్లు వసూల్ చేసినట్టు తెలుస్తోంది.