త్రిష ఫ్రెండ్ గా నటించడం వల్ల నా కెరీర్ నాశనం..రాజమౌళి ఆఫర్ రిజెక్ట్ చేయకుండా ఉండాల్సింది, నటి అర్చన

First Published Apr 15, 2024, 2:13 PM IST

నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఖలేజా, శ్రీరామ దాసు చిత్రాలతో నటి అర్చన టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. నటి అర్చన హీరోయిన్ గా రాణించేందుకు ఆమెకి అన్ని అర్హతలు ఉన్నాయి.

నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఖలేజా, శ్రీరామ దాసు చిత్రాలతో నటి అర్చన టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. నటి అర్చన హీరోయిన్ గా రాణించేందుకు ఆమెకి అన్ని అర్హతలు ఉన్నాయి. చూడ చక్కని రూపంతో పాటు అన్ని రకాల ఎమోషనల్ పలికించగల నటి అర్చన. 

కెరీర్ ఆరంభంలో హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో నటించిన అర్చన ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేసింది. హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. అయితే తన కెరీర్ నాశనం కావడానికి కారణం ఒకే ఒక్క చిత్రం అంటూ అర్చన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానా. 

ఈ చిత్రంలో అర్చన త్రిషకి ఫ్రెండ్ గా నటించింది. అప్పుడే అర్చనకి హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. హీరోయిన్ ఒకటి రెండు చిత్రాలు చేసి ఉంది. ఆ టైంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో త్రిష ఫ్రెండ్ గా నటించాలని అడిగారు. నాకు ఏమాత్రం ఇష్టం లేదు. హీరోయిన్ కి ఫ్రెండ్ గా చేస్తే నాకు హీరోయిన్ గా ఛాన్సులు రావడం కష్టం. కానీ బలవంతంగా ఒప్పించారు. 

ఇది అన్ని చిత్రాల్లో లాగా పాత్ర కాదని చాలా బావుంటుందని ఒప్పించారు. ఒక విధంగా చెప్పి మరో విధంగా చేశారు. ఆ సినిమా పెద్ద హిట్ అయి ఉండొచ్చు. కానీ నా కెరీర్ నాశనం అయింది ఆ చిత్రం వల్లే. కళ్లద్దాలు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ బలవంతంగా పెట్టించారు. నటి కళ్ళే ప్రధానంగా కనిపించాలి. కానీ కళ్ళజోడు పెట్టారు. దీనితో సెట్స్ లో ఏడ్చేదాన్ని అని అర్చన వాపోయింది. 

సినిమా హిట్ అయినప్పటికీ.. ఈ అమ్మాయి ఆ చిత్రం హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది అని ఇండస్ట్రీ మొత్తం వ్యాపించింది. దీనితో నన్ను హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మానేశారు. నన్ను నేను ఆ పొజిషన్ లో చూసుకోవాలనుకోలేదు. ఒక చిత్రాన్ని హీరోయిన్ గా నా భుజాలపై మోసే కెపాసిటీ నాకు ఉంది. 

నువ్వొస్తానంటే నేనొద్దంటానా తర్వాత హీరోయిన్ గా ఛాన్సులు తగ్గిపోయాయి. ఆ తర్వాత మగధీర చిత్రంలో రాజమౌళి గారు ఒక పాత్ర చేయాలని అడిగారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా తర్వాత ఇక ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. ప్రతి పాత్రకి ఓకె చెప్పకూడదు. హీరోయిన్ గా వస్తేనే చేద్దాం అని అనుకుంటున్నా. ఆ టైంలో రాజమౌళి గారు మగధీర చిత్రంలో పాత్ర ఉందని చెప్పారు. 

ఆ పాత్రని మగధీరతో సలోని చేసింది. ముందు నన్ను అడిగారు. కానీ అలాంటి పాత్రలు చేయకూడదు అని నిర్ణయించుకున్నాను కాబట్టి రిజెక్ట్ చేశాను. కానీ ఇప్పుడు మాత్రం చేసి ఉంటె బావుండేది కదా అని అనిపిస్తోంది. ఆ చిత్రంలో నేను చేయకపోవడం నా మిస్టేక్ అని అర్చన తెలిపింది. 

click me!