ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు జరుగుతున్న అన్యయం, వివక్షపై ఘాటుగా స్పందించారు నటి అర్చన. ఈ విషయం గురించి అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నారు. ముఖ్యంగా పెళ్ళైన నటీమణుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అన్నారు.
తెలుగు ఫిల్మ ఇండస్ట్రీలో హీరోలకు హీరోయిన్లకు మధ్య రెమ్యూనరేషన్ విషయంలో వివక్ష దారుణంగా ఉందన్నారు నటి అర్చన. ఈవివక్షపై గట్టిగా స్పందించారు అర్చన.కొంతకాలం ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన ఆమె తిరిగి ఆడియన్స్ ముందుకు వచ్చారు.
26
పెళ్లి చేసుకుని ప్యామిలీ లైఫ్ లో బిజీ బిజీ అయిపోయిన అర్చన..ఫిల్మ్ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంది అయితే ఈ సందర్భంగా ఇండస్ట్రీలో జరుగుతున్న మేల్ డామినేషన్ పై తీవ్రంగా స్పందించింది సీనియర్ బ్యటి. మిగతా అన్ని ఇండస్ట్రీస్ లో హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా సమానమైన గుర్తింపు ఉంటుంది. కాని మనదగ్గర అలా లేదంటోంది.
36
మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం పరిస్థితులు వేరు అంటోంది. ఒక హీరోయిన్ పెళ్లయిన తర్వాత తిరిగి యాక్ట్ చేయడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి అంటోంది. పెళ్లయిన హీరోయిన్ లను మన నిర్మాతలు రెమ్యూనరేషన్ తగ్గించుకోమంటారు మరి అదే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న హీరోలకు ఆ మాట చెప్పగలరా...? అని ప్రశ్నించారు.
46
ఇంత వివక్ష ఎందుకు చూపుతున్నారో తెలియడం లేదంటూ అవేదన వ్యక్తం చేశారు అర్చన. ఫ్యూచర్లో అయినా తెలుగు ఇండస్ట్రీ లో ఇలాంటి భేదాలు లేకుండా ఉండాలని అర్చన కోరకున్నారు.
56
తపన అనే సినిమా తో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ కు పరిచియం అయ్యింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, సామాన్యుడు, శ్రీ రామరాజ్యం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది బ్యూటీ.
66
ఇక రాను రా ను సినిమాల్లో ఆమెకు ఛాన్సులు తగ్గడం, వచ్చినా.. సరైన అవకాశాలు రాకపోవడం వల్ల చిన్నగా తెరకు దూరం అయ్యింది బ్యూటీ. అయితే తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ లాంటి భాషల్లో అర్చన నటించినా కాని.. అక్కడ అక్కడ కూడా ఆమెకు మంచి అవకాశాలు దక్కలేదు.