నాలుగు దశాబ్దాల కెరీర్లో ఆమె చిత్ర పరిశ్రమను వడపోశారు. రకరకాల మనుషులను చూశారు. కొన్నాళ్లుగా ఆమె పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె కీలక ఆరోపణలు చేశారు. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేదని ఆమె కుండబద్దలు కొట్టారు.