టాప్ యాంగిల్ లో తెలుగు బ్యూటీ క్యూట్ సెల్ఫీలు.. గాగూల్స్ తో అంజలి స్టైలిష్ లుక్..

First Published | Oct 20, 2023, 1:24 PM IST

తెలుగు హీరోయిన్ అంజలి తాజాగా క్యూట్ ఫోటోలను పంచుకుంది. బ్యూటీఫుల్ లుక్ లో అదిరిపోయే సెల్ఫీలతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. ఈ క్రమంలో నెట్టింటా దర్శనమిస్తోంది. 
 

తెలుగు హీరోయిన్ అంజలి (Anjali) ప్రస్తుతం తెలుగులో వరుస చిత్రాలను ఓకే చేస్తోంది. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, విశ్వక్ సేన్ 11 వంటి చిత్రాలో కీలక పాత్రలు పోషిస్తోంది. అలాగే ‘బహిష్కరణ’ అనే మరో మూవీలోనూ నటిస్తోంది. చేతినిండా సినిమాలతో బిజీ అవుతోంది.  
 

ఇప్పటికే తమిళం, తెలుగులో అంజలి స్టార్ హీరోలకు జోడీగా నటించిన విషయం తెలిసిందే. విభిన్న పాత్రలు  పోషించి ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. మరోవైపు స్పెషల్ అపీయరెన్స్ తోనూ అదరగొట్టింది.


సినిమాలతో వరుసగా థియేటర్లలో అలరిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. కాస్తా అరుదుగానే కనిపిస్తున్నా క్రేజీ పోస్టులతో ఆకట్టుకుంటోంది. తాజాగా తెలుగు బ్యూటీ క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

లేటెస్ట్ గా అంజలి క్యూట్ సెల్ఫీలకు ఫోజులిచ్చి మంత్రముగ్ధులను చేసింది. మెరిసిపోయే కురులు, రూపసౌందర్యం, కళ్లకు సన్ గ్లాసెస్, వైట్ డ్రెస్ లో అంజలి బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. తన అందంతో ఆకట్టుకుంది. తాజాగా పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

ఇక అంజలి నుంచి Geethanjali Part 2  కూడా రాబోతోంది. కొన వెంకట్ సమర్పణలో మళ్లీ ప్రేక్షకులకు ముందుకు రానుంది. షూటింగ్ ప్రారంభమై శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే వదిలిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. 

ఎంవీవీ మూవీస్ బ్యాన్ ర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా అంజలి వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు తెలుగు సినిమాల్లోనే నటిస్తోంది. ఈక్రమంలో నెట్టింటా ఇలా దర్శనమిస్తూ ఖుషీ చేస్తోంది. 

Latest Videos

click me!