రష్మిక మందాన బోల్డ్ అని తెలుసు కానీ మరీ ఇంత అనుకోలేదు. ఆమె ముద్దు ముచ్చట్ల గురించి కూడా సందేహాలు అడుగుతుంది. 'నాకు పెదాలతో గుచ్చటం రాదు. కిస్ చేసే విధానం ఇదేనా' అని అర్థం వచ్చేలా ఓ ఇంగ్లీష్ కామెంట్ చేసింది. ముద్దిస్తున్నట్లు పెదాలు ముడిచి కవ్వించే ఫోటో దిగారు. రష్మిక చిలిపి ప్రశ్నకు నెటిజెన్స్ పలు విధాల కామెంట్స్ పెడుతున్నారు.
25
Rashmika Mandanna
ఇక అనతికాలంలో ఎదిగిన ఈ కన్నడ భామ వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు.గత ఏడాది రష్మికకు మిక్స్డ్ ఫలితాలు వచ్చాయి. విజయ్ కి జంటగా నటించిన వారిసు రూ. 300 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. తెలుగు వెర్షన్ వారసుడు మాత్రం పర్లేదు అనిపించుకుంది. రష్మిక చేతిలో పుష్ప 2, యానిమల్ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి.ఇవి రెండు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
35
photo credit- rashmika instagram
ఇటీవల మరో రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నారు. వెంకీ కుడుములతో రష్మికకు ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో సేమ్ కాంబోలో భీష్మ తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. అలాగే రైన్ బో టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ చిత్రం ప్రకటించింది.
45
Rashmika Mandanna
మరోవైపు రష్మిక ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటున్నారు. తరచుగా విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ ట్రిప్స్ కి వెళుతున్న నేపథ్యంలో సంథింగ్ సంథింగ్ అనే ప్రచారం జోరందుకుంది. విజయ్ దేవరకొండతో పాటు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లినట్లు రష్మిక ఒప్పుకున్నారు. ఫ్రెండ్ తో ట్రిప్ వెళితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు.
55
Image: Rashmika Mandanna Instagram
ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే. ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు ఆధారాలు దొరికాయి. రష్మిక-విజయ్ దేవరకొండ ఒకే హోటల్ లో ఉన్నట్లు రుజువైంది. అయితే ప్రేమికులమని ప్రకటించడం లేదు. వీరి బంధం ఏమిటో తెలియాలంటే మరికొంత వేచి చూడాల్సిందే. విజయ్ దేవరకొండతో రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు.