అదిరిపోయే డ్రెస్ లో అనసూయ కిర్రాక్ ఫోజులు.. వన్ షోల్డర్ టాప్ లో రంగమ్మత్త అందాల మెరుపులు

First Published | Jun 1, 2023, 12:53 PM IST

బుల్లితెర అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)  రోజుకో లుక్ లో దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. అందాల ప్రదర్శనతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. లేటెస్ట్ పిక్స్  అదిరిపోయాయి.
 

‘జబర్దస్త్’ షోతో స్టార్ యాంకర్ గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అనసూయ పరిచయం అయిన విషయం తెలిసిందే. 2012 నుంచి గతేడాది వరకు పదేళ్ల పాటు ఆడియెన్స్ ను అలరించింది. యాంకర్ గానే కాకుండా షోలో గ్లామర్ బ్యూటీగానూ మెరుపులు మెరిపించింది.
 

బుల్లితెరపై అందాలను ఒళకబోసిన ఈ ముద్దుగుమ్మ కొద్దిరోజుల్లోనే సెన్సేషన్ గా మారింది. గ్లామర్ షోతో మతులు పోగొట్టిన అనసూయకు సినిమాల్లోనూ నెమ్మదిగా అవకాశాలు ప్రారంభమయ్యాయి. తొలుత స్పెషల్ అపియరెన్స్ తో వెండితెరపై మెరుపులు మెరిపించింది.


కొన్నాళ్ల తర్వాత బుల్లితెరపై కంటే వెండితెరపైనే అనసూయ బిజీ అవుతూ వచ్చింది. ‘రంగస్థలం’, ‘క్షణం’,  ‘పుష్ఫ’ చిత్రాలతో అనసూయ క్రేజ్ ఇండస్ట్రీలో గట్టిగానే పెరిగిందని చెప్పొచ్చు. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది. 
 

ప్రస్తుతం బుల్లితెరకు దూరమైన రంగమ్మత్త వెండితెరకే పరిమితమైంది. సినిమాల్లో మాత్రమే కనిపిస్తోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ కాస్తా అప్సెట్ అవుతున్నారు. దీంతో అనసూయ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తోంది. 

ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్ల మతులు పోగొడుతోంది. కొద్దిరోజులుగా గ్యాప్ ఇవ్వకుండా రోజుకో లుక్ లో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తోంది.
 

నిన్న చీరకట్టులో అందాల విందు చేసిన అనసూయ.. తాజాగా ట్రెండీ లెహంగా, మ్యాచింగ్ టాప్ ధరించి ఫొటోషూట్ చేసింది. అదిరిపోయే లెహంగా, వన్ షోల్డర్ టాప్ లో మతులు పోయేలా ఫొజులిచ్చింది. గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. ఓ గదిలో సోఫావద్ద మతులు చెడగొట్టేలా స్టిల్స్  ఇచ్చింది.

మత్తు కళ్లతో, మత్తెక్కించే చూపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మరోవైపు పరువాలను ప్రదర్శిస్తూ మంత్రముగ్ధులను చేసింది. అలాగే తీరొక్క అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ తన ఫ్యాషన్ సెన్స్ ను కూడా చూపిస్తోంది. నిజానికి అనసూయ ఎంచుకునే దుస్తులు, డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది.
 

ఇదిలా ఉంటే.. అనసూయ కీలక పాత్రలో నటించి ‘విమానం’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ట్రైలర్ కూడా విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో అనసూయ ఫుల్ బిజీగా ఉంది. అలాగే  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న Pushpa2లోనూ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

Latest Videos

click me!