బిడ్డ ఒకరితో.. పెళ్ళి మరొకరితో... రామ్ చరణ్ హీరోయిన్ ఇలా చేసిందేంటి..?

First Published | Aug 26, 2024, 9:54 PM IST

మాజీ ప్రియుడితో సహజీవనం.. బిడ్డ పుట్టిన తరువాత బ్రేకప్.. ఇక తాజాగా పెళ్ళి మరొకరిని చేసుకుంది రామ్ చరణ్ హీరోయిన్..  ఇలా చేసిందేంటి..? 

ఎమి జాక్సన్

1992లో జన్మించిన నటి ఎమి జాక్సన్ వయస్సు 32. 2009లో, తన 17వ ఏట నుండి మోడలింగ్ రంగంలో తన జర్నీని స్టార్ట్ చేసింది.  2010లో జరిగిన "మిస్ ఇంగ్లాండ్" పోటీలో పాల్గొని రెండో స్థానంలో నిలిచారు ఎమి జాక్సన్.

ఎడ్ వెస్ట్విక్

మిస్ ఇంగ్లాండ్ పోటీలో పాల్గొన్న ఆ సంవత్సరమే ఆమెకు సినిమాల్లో నటించే అవకాశం లభించింది. ఆమె నటించిన తొలి సినిమా, 2010లో ఎ.ఎల్ విజయ్ దర్శకత్వంలో, ఆర్యా  హీరోగా నటించిన "మద్రాసపట్టినం" అనే తమిళ చిత్రం. "దురైఅమ్మ" అనే ఆ పాత్రలో ఆమె చాలా చక్కగా నటించింది.


నటి ఎమి జాక్సన్

తమిళం, హిందీ, తెలుగు, కన్నడ మరియు హాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ వచ్చిన ఎమి జాక్సన్, 2015లో జార్జ్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది.  వారికి ఒక మగబిడ్డ జన్మించాడు. అయితే తరువాత వారి మధ్య విభేదాలు రావడంతో, 2021లో జార్జ్‌ కు బ్రేకప్ చెప్పింది బ్యూటీ.  ఎమి జాక్సన్, ఎడ్ వెస్ట్విక్ అనే వ్యక్తితో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంది.

ఎమి జాక్సన్ పెళ్లి

తన ప్రియుడు వెస్ట్విక్‌తో చాలా సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న నటి ఎమి జాక్సన్, ఈ ఏడాది ప్రారంభంలో అతడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని, వారిద్దరికీ సాదాసీదాగా నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది. ఇక తాజాగా ఈ జంట అతి సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Latest Videos

click me!