Abhinaya Wedding
Actress Abhinaya Wedding : నటి అభినయ ఇంట్లో గత కొన్ని వారాలుగా పెళ్లి సందడి కనిపిస్తోంది. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి నటి అభినయ తన పెళ్ళికి సంబంధించిన విషయాలని అభిమానులతో పంచుకుంటున్నారు. అభినయ పర్సనల్ లైఫ్ లో చాలా రూమర్స్ వచ్చాయి.
Abhinaya Wedding
చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోంది అని, హీరోతో ఏడడుగులు నడవబోతోంది అని రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ కి నటి అభినయ ఫుల్ స్టాప్ పెట్టింది. తాను 15 ఏళ్ళు తన స్నేహితుడితో రిలేషన్ లో ఉన్నట్లు అప్పుడే ప్రకటించింది. తన ప్రియుడి విషయాలు కొన్ని రోజులు దాచిపెట్టిన అభినయ ఇటీవల రివీల్ చేసింది. అతడి పేరు సన్నీ వర్మ. మార్చిలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.
Abhinaya Wedding
ఎట్టకేలకు ఈ జంట వివాహం చేసుకుని తమ ప్రేమని మరో స్థాయికి తీసుకెళ్లారు. అభినయ, సన్నీ వర్మ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ బద్దంగా అభినయ వివాహం బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. జంట సాంప్రదాయ వస్త్ర ధారణలో చూడ ముచ్చటగా ఉన్నారు.
Abhinaya Wedding
తనకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటుండడంతో అభినయ సంతోషంలో చిరునవ్వులు చిందిస్తోంది. ఆమె పెళ్లి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జీవితం ప్రారంభించిన వధూవరులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Abhinaya Wedding
అభినయ తెలుగులో శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేనింతే, దమ్ము, ధృవ, ఫ్యామిలీ స్టార్ లాంటి చిత్రాల్లో నటించింది. సన్నీ వర్మ హైదరాబాద్ కి చెందిన వ్యక్తి.
Abhinaya Wedding
అభినయ రాజమండ్రిలో జన్మించారు. మొదట మోడలింగ్ లో రాణించి ఆ తర్వాత నటిగా అవకాశాలు అందుకుంది. హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహం జరిగింది. ఏప్రిల్ 20న రిసెప్షన్ వేడుక నిర్వహించబోతున్నారు.