నటుడు విజయ్ వివాహేతర సంబంధం కారణంగా తాము విడిగా జీవిస్తున్నామని, ఇప్పుడు విడాకులు కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సంగీత విజయ్ తెలిపారు. ఈ వార్త కోలీవుడ్‌లో కలకలం రేపుతోంది.
2021లో విజయ్ ఆ నటితో కలిసి ఉన్న ఫోటో బయటకు రావడంతో మొదటిసారి ఈ విషయం సంగీతకు తెలిసింది. అప్పటి నుంచి విజయ్ మానసికంగా, భావోద్వేగపరంగా తన నుంచి దూరమయ్యారని ఆమె అన్నారు. 2021 నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నా, వేర్వేరుగా జీవిస్తున్నామని తెలిపారు. తన భర్త విజయ్ తరచూ ఆ నటితో కలిసి విదేశాలకు వెళ్తున్నారని, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సంగీత ఆరోపించారు.
26
నటితో విజయ్ ఫోటోలు:
"నా భర్త ఆ నటితో విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ ఇద్దరూ కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఆ ఫోటోలను సదరు నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. వాటిని చూడటం నాకు చాలా బాధగా, అవమానంగా ఉంది" అని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
36
ఆ నటి పేరు చెప్పను:
"ప్రస్తుతానికి నేను ఆ నటి పేరును బయటపెట్టడం లేదు. ఆమె గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. విచారణ సమయంలో అవసరమైతే, నా భర్తకు, ఆ నటికి మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టడానికి నేను వెనుకాడను. అవసరమైతే ఆమెను ఈ కేసులో రెండో ప్రతివాదిగా చేర్చుతాను" అని సంగీత స్పష్టం చేశారు.
"విజయ్ వివాహేతర సంబంధం వల్ల నా పిల్లలు, నేను స్నేహితులు, బంధువుల మధ్య అవమానాలు ఎదుర్కొంటున్నాం. పిల్లలు చాలా బాధతో, వేదనతో ఉన్నారు. తండ్రే లోకంగా బతికిన నా పిల్లలు ఇప్పుడు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు" అని సంగీత ఆవేదన వ్యక్తం చేశారు.
56
ప్రశ్నించినందుకే ఈ శిక్ష:
ఓ నటితో విజయ్‌కు ఉన్న సంబంధం గురించి తెలుసుకుని ప్రశ్నించినందుకు, సంగీత స్వేచ్ఛను విజయ్ హరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమెపై ఆర్థికంగా కూడా అనేక ఆంక్షలు విధించి, బానిసలా చూశాడని ఆరోపించారు.
66
విజయ్‌కు వరుస ఎదురుదెబ్బలు:
విజయ్‌కు ఈ మధ్య వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కరూర్ ఘటన: 'తమిళగ వెట్రి కళగం' పార్టీ తరఫున కరూర్‌లో ప్రచారం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో పలువురు మరణించడంతో, విజయ్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఆ కేసు ఇంకా కొనసాగుతోంది. 'జనగణ' సినిమా: విజయ్ నటించిన చివరి సినిమా 'జనగణ' సెన్సార్ సమస్యలతో విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు భార్య విడాకుల పిటిషన్ ఆయనకు మరో పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యలన్నింటినీ దాటి విజయ్ తమిళనాడు సీఎం అవుతారా, లేక రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని అభిమానులు గందరగోళంలో ఉన్నారు.