OTT Movies: ప్రైమ్‌లో దుమ్మురేపుతున్న ప్రియాంక చోప్రా మూవీ.. టాప్‌ 10లో ఉన్న తెలుగు సినిమాలివే

Published : Feb 27, 2026, 09:59 PM IST

అమెజాన్‌ ప్రైమ్‌లో ఇప్పుడు పలు క్రేజీ సినిమాలు ట్రెండ్‌ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా సినిమా రచ్చ చేస్తుంది. అలాగే తెలుగు సినిమాలు కూడా టాప్‌ 10లో ట్రెండ్‌ అవుతుందటం విశేషం. 

PREV
15
ప్రైమ్‌ వీడియోస్‌లో టాప్‌ 10 మూవీస్‌

థియేటర్లతోపాటు ఓటీటీలోకి వచ్చిన సినిమాలే ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఓటీటీలో పలు క్రేజీ సినిమాలు సందడి చేస్తున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రియాంక చోప్రా సినిమా  దుమ్మురేపుతోంది. మరోవైపు ఇండియా వైడ్‌గా తెలుగు సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయి. అందులో శర్వానంద్‌కి ఒక కుర్ర హీరో ఝలక్‌ ఇవ్వడం విశేషం. మరి టాప్‌ 10లో ఉన్న సినిమాలేంటో చూద్దాం.

25
ప్రైమ్‌లో ప్రియాంక చోప్రా మూవీ టాప్‌లో ట్రెండింగ్‌

ప్రైమ్‌ వీడియోలో `వారణాసి` ఫేమ్‌, గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించిన `ది బ్లఫ్‌` సినిమా దుమ్మురేపుతోంది. నెంబర్‌ 1 స్థానంలో దూసుకుపోతుంది. ఈ చిత్రం రెండు రోజుల(ఫిబ్రవరి 25) క్రితమే ప్రైమ్‌లోకి వచ్చింది. ఫ్రాంక్‌ ఈ ఫ్లావర్స్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, కర్ల్ అర్బన్‌, ఇస్మాయిల్‌ క్రష్‌ కార్డోవా ప్రధాన పాత్రలు పోషించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతూ మొదటి స్థానంలో రన్‌ అవుతుంది. రెండో స్థానంలో `తు మేరి మెయిన్‌ తేరా, మెయిన్‌ తేరా తు మెరీ` ట్రెండింగ్‌లో ఉంది. ఆ తర్వాత మూడో స్థానంలో ధర్మేంద్ర చివరగా నటించిన `ఇక్కీస్‌` మూవీ ట్రెండ్‌ అవుతుంది.

35
నాల్గో స్థానంలో తెలుగు సినిమా ఈషా ట్రెండింగ్‌

నాల్గో స్థానంలో తెలుగు సినిమా ఉండటం విశేషం. `రాజు వెడ్స్ రాంబాయి` ఫేమ్‌ అఖిల్‌ రాజ్‌, త్రిగుణ్‌, హేబా పటేల్‌, సిరి హన్మంతు కలిసి నటించిన `ఇషా` మూవీ సత్తా చాటుతోంది. ఈ మూవీ గత వారమే ఓటీటీలోకి వచ్చింది. ఇది హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. థియేటర్లలోనూ మంచి వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ఐదో స్థానంలో `హాట్‌ స్పాట్‌ 2` ట్రెండ్‌ అవుతుంది.   అలాగే హాలీవుడ్‌ ఫిల్మ్ `ది ఆస్ట్రోనాట్‌` టాప్‌ 6లో ట్రెండ్‌ అవుతుంది.

45
టాప్‌ 7లో శర్వానంద్‌ `నారీ నారీ నడుమ మురారి` ట్రెండింగ్‌

టాప్‌ 7లో తెలుగు మూవీ ఉంది. శర్వానంద్‌, సంయుక్త మీనన్‌, సాక్షి వైద్య, నరేష్‌, సిరి హన్ముంతు నటించిన `నారీ నారీ నడుమ మురారి` మూవీ ఉంది. ఇది సంక్రాంతికి విడుదలై హిట్‌ అయ్యింది. హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మెప్పించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఆడుతోంది. అయితే కుర్ర హీరోలు నటించిన `ఇషా` మూవీ శర్వానంద్‌ సినిమాని దాటి టాప్‌లో దూసుకుపోవడం విశేషం.  

55
`వన వీర` టాప్‌ 8లో ట్రెండింగ్‌

దీంతోపాటు మరో చిన్న సినిమా `వనవీర` ట్రెండ్‌ అవుతుంది. ఇది ఇండియా వైడ్‌గా 8వ స్థానంలో దూసుకుపోతుంది. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోవడం విశేషంగా చెప్పొచ్చు.  తొమ్మిదో స్థానంలో `8 ఏఎం మెట్రో`, పదో స్థానంలో `ఐ యామ్‌ గాడ్‌` చిత్రాలు ట్రెండ్‌ అవుతున్నాయి. మొత్తంగా తెలుగు ఆడియెన్స్ కి కావాల్సిన స్టఫ్‌ ప్రైమ్‌లో పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories