డబ్బుల కోసం అమ్మ పరువు తీస్తారా... నటి సురేఖావాణి కూతురు సంచలన పోస్ట్!

Published : Mar 03, 2021, 12:34 PM ISTUpdated : Mar 03, 2021, 12:39 PM IST

నటి సురేఖా వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. నిరాధారణమైన కథనాలకు ఆమె నిరసన వ్యక్తం చేశారు. డబ్బులు కోసం ఒక వ్యక్తి పరువుతో ఆడుకుంటారా అంటూ.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.   

PREV
18
డబ్బుల కోసం అమ్మ పరువు తీస్తారా... నటి సురేఖావాణి కూతురు సంచలన పోస్ట్!
సురేఖావాణి భర్త దర్శకుడు సురేష్ తేజా అకాల మరణం పొందారు. 2019లో ఆయన మరణించడం జరిగింది. అప్పటి నుండి సురేఖా వాణి తన కూతురు సుప్రీతతో కలిసి ఉంటున్నారు.

surekha vani

28
టీనేజ్ లో ఉన్న కూతురు సుప్రీతతో సురేఖా చాలా సన్నిహితంగా ఉంటారు. సోషల్ మీడియాలో వీరిద్దరూ తరచుగా ఫోటోలు, వీడియోలు పంచుకుంటారు. అలాగే ఇష్టమైన ప్రదేశాలకు ట్రిప్ కి వెళుతూ ఉంటారు.

surekha vani

38
కాగా సురేఖా వాణి రెండో వివాహం చేసుకోబోతున్నారని రెండు వారాలుగా వరుస కథనాలు వెలువడుతున్నాయి. సింగర్ సునీత మాదిరి సురేఖా వాణి కూడా రెండవ వివాహం చేసుకోవాలని, కూతురు కోరుకుంటున్నారని, ఆమె ఒత్తిడితో సురేఖా పెళ్ళికి సిద్దమయ్యారనేది సదరు వార్తల సారాంశం.

surekha vani

48
అయితే ఈ వార్తలను సురేఖా ఖండించారు. ప్రచారం జరుగుతున్న వార్తలలో నిజం లేదని, తాను రెండవ వివాహం చేసుకోవడం లేదని వివరణ ఇచ్చారు.

surekha vani

58
అయినప్పటికి ఎదో ఒక మాధ్యమం ద్వారా సురేఖా పెళ్లి వార్త ప్రచారంలోకి వస్తుంది. సదరు వార్తలతో విసిగిపోయిన సురేఖా కూతురు సుప్రీత.. సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

surekha vani

68
యదార్థాలు కాకుండా.. ఊహాజనితమైన వార్తలు రాయకండి. మిమ్మల్ని మీరు జర్నలిస్టులు అని చెప్పుకోవద్దు. మీ ఆదాయం కోసం ఒక వ్యక్తి పరువు, గౌరవం ఎలా దెబ్బ తెస్తారని ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పొందుపరిచారు.

surekha vani

78
సుప్రీత సోషల్ మీడియా పోస్ట్ ద్వారా నిరాధారమైన రాతలకు కౌంటర్ ఇవ్వడమే కాకుండా.. తల్లి రెండవ పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టత ఇచ్చారు.

surekha vani

88
మరో వైపు సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. సురేఖా మాత్రం గతంతో పోల్చితే సినిమాలు తగ్గించారు.

surekha vani

click me!

Recommended Stories