ఇక పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాలు చేస్తున్నారు. `ఆచార్య`, `మోసగాళ్లు` చిత్రాల్లో నటించింది. కానీ ఈ ఏడాది ప్రారంభంలోనే కాజల్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని గౌతమ్ కిచ్లు ప్రకటించారు.కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ, ఈ ఏడాది తమ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారని, తమకి ఈ ఇయర్ చాలా స్పెషల్ అని పేర్కొన్నారు. అంటే అప్పటికే కాజల్ ఐదు నెలల గర్భవతిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్టకేలకు మగబిడ్డకి జన్మనివ్వడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ బ్లెస్సింగ్స్ ని అందిస్తున్నారు.