శోభన్ బాబు అభిమానించిన ఒకే ఒక నటుడు ఎవరో తెలుసా? కారణం ఏమిటీ?

First Published Jun 14, 2024, 11:44 AM IST

శోభన్ బాబు చాలా రిజర్వ్డ్ గా ఉంటారట. ఆయన ఇతరుల ఇళ్లకు వెళ్లడం, పార్టీలలో పాల్గొనడం చేయడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్స్ తో కూడా ఆంటీ ముట్టనట్టుగా ఉండే శోభన్ బాబు ఒక నటుడిని మాత్రం అమితంగా అభిమానించేవాడట. 
 

Sobhan Babu

శోభన్ బాబు ఆంధ్రుల అందగాడు. సోగ్గాడిగా ప్రేక్షకుల గుండెల్లో స్థిరస్థాయిగా ఉండిపోయాడు. శోభన్ బాబు క్రమశిక్షణకు మారుపేరు. సంపాదించిన ప్రతి రూపాయిని పెట్టుబడిగా ఎలా మలచాలో తెలిసిన ఆర్థిక నిపుణుడు. ఆయన సలహా పాటించి కోట్లు సంపాదించిన నటులు ఎందరో ఉన్నారు. 
 

Sobhan Babu

ఒక స్టార్ గా దశాబ్దాల పాటు సినిమాలు చేసిన శోభన్ బాబు తన కుటుంబాన్ని మాత్రం చిత్ర పరిశ్రమకు తీసుకురాలేదు. అందుకు కారణం లేకపోలేదు. పరిశ్రమ స్థిరత్వం లేనిది. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. తన కుమారుడిని సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా తయారు చేశారు. 

Latest Videos


Sobhan Babu

ఇక ముక్కుసూటితనం. ఇతర స్టార్స్ తో సత్సంబంధాలు కొనసాగించకపోవడం శోభన్ బాబును ఇబ్బందులకు గురి చేసిందట. ఒక దశలో ఆయన్ని పరిశ్రమ పక్కన పెట్టింది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డాడట. ఎందరు తొక్కాలని చూసినా శోభన్ బాబు తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. 90 ల వరకు హీరోగా ఆయన నటిస్తూనే ఉన్నారు. 

తన స్టార్డం పోయిందని తెలిశాక శోభన్ బాబు సినిమాలు చేయలేదు. ఈ తరం స్టార్ హీరోల చిత్రాల్లో కీలకమైన క్యారెక్టర్ రోల్స్ ఆయన తలుపు తట్టాయి. హీరోగా రిటైర్ అయిన నేను ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ హీరోగానే ఉండిపోవాలి. క్యారెక్టర్ రోల్స్ అసలు చేయనని శోభన్ బాబు తెగేసి చెప్పారట.

చాలా రిజర్వ్డ్ గా ఉండే శోభన్ బాబు పరిశ్రమలో ఒక నటుడిని మాత్రం చాలా ఇష్టపడేవాడట. ఆయన ఎవరో కాదు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయనంటే శోభన్ కి ప్రత్యేక అభిమానం ఉండేదట. ఈ విషయాన్ని గుమ్మడి కూతురు శారద ఓ సందర్భంలో తెలిపారు. 

శోభన్ బాబు ఎవరింటికీ రారు. కానీ ఒకసారి మద్రాస్ లో నాన్న గుమ్మడి బర్త్ డే వేడుకలు నిర్వహించాము. ఆయన వేడుకల్లో పాల్గొన్నారు. ఆ రోజంతా నాన్నతోనే ఉన్నారు. మా చిన్న చెల్లెలు పెళ్ళి సమయంలో శోభన్ బాబు అవుట్ డోర్ షూటింగ్ లో ఉన్నాడు. దాంతో శోభన్ బాబు భార్యను పంపారు. అంతగా నాన్న అంటే శోభన్ బాబు అభిమానం చూపేవారని.. గుమ్మడి కూతురు శారద వెల్లడించారు. 
 


శోభన్ బాబు కంటే సీనియర్ గుమ్మడి. ఇక శోభన్ బాబు-గుమ్మడి కాంబినేషన్ లో పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. గుమ్మడి 2010లో 82 ఏళ్ల వయసులో కన్నుమూశారు. శోభన్ బాబు 71 ఏళ్ల వయసులో 2008లో తుదిశ్వాస విడిచారు. గొప్పనటులుగా పేరున్న ఈ ఇద్దరు లెజెండ్స్ చిరస్థాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. 

click me!