Niharika: చిరంజీవి క్యాస్టింగ్‌ కౌచ్‌ కామెంట్‌పై నిహారిక అదిరిపోయే రియాక్షన్‌.. `రాకాస` టీజర్‌ ఎలా ఉందంటే

Published : Mar 02, 2026, 04:56 PM IST

చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఆ మధ్య చిరంజీవి కామెంట్‌ చేశారు. దీనికి నిహారిక స్పందించింది. `రాకాస` సినిమా టీజర్‌ ఈవెంట్‌లో ఆమె ఆసక్తికర కామెంట్ చేసింది. 

PREV
15
నిహారిక నిర్మాతగా `రాకాస` మూవీ

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నిర్మాతగా `రాకాస` అనే మూవీని రూపొందించారు. సంగీత్‌ శోభన్‌, నయన సారిక జంటగా నటించిన ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ పతాకాలపై ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌తో కలిసి నిహారిక ఈ చిత్రాన్ని నిర్మించింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు. ఇది ఆకట్టుకుంటోంది. కామెడీగా సాగుతూనే భయపెట్టింది. థ్రిల్‌కి గురి చేసింది. అంచనాలను పెంచింది.

25
రాకాస మూవీ టీజర్‌ ఎలా ఉందంటే

టీజర్‌ని గమనిస్తే, `నరకం నుండి సందేశం వస్తుంది. ఇక సమయం లేదు, మన ఊరి శాపమిది, మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత` అంటూ ఊరిని, ఊరి జనాల్ని పరిచయం చేస్తూ టీజర్‌ ప్రారంభమైంది. `శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.. ఈ రెండు లైన్సే వస్తున్నాయేంటి?` అంటూ భయపడుతూ, నవ్విస్తూ హీరో సంగీత్‌ శోభన్‌ పాత్రని పరిచయం చేశారు. హీరో పాత్ర ఎంట్రీ ఇచ్చిన తరువాత టీజర్ పూర్తిగా కామెడీ జానర్‌లోకి మారిపోయింది. ఇదే ఆఖరి హెచ్చరిక అంటూ మళ్లీ మరో కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లినట్టుగా అనిపిస్తుంది.

35
ఏప్రిల్‌ 3న `రాకాస` మూవీ

ఆ తరువాత చూపించిన యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. ఇక చివర్లో సంగీత్‌కి ఓ అమ్మాయి ఎదురుగా నిలబడుతుంది. కొంగు కప్పుకొని ఉండగా, ఆమెని చూసి భయపడుతూ, `స్త్రీ.. రేపు రా` అనే డైలాగ్ చెప్పడం అదిరిపోయింది. నవ్వులు పూయించింది. టీజర్ చూస్తుంటే కంప్లీట్ పవర్ ఫ్యాక్డ్ సినిమాలా కనిపిస్తోంది. నవ్వించడం, భయపెట్టడంతో పాటు ఏదో ఓ కొత్త కాన్సెప్ట్‌ను `రాకాస`లో పరిచయం చేయబోతోన్నట్టుగానే కనిపిస్తోంది. టీజర్‌తో ఒక్కసారిగా అంచనాల్ని అమాంతం పెంచేసినట్టు అయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న విడుదల చేయబోతున్నారు.

45
క్యాస్టింగ్‌ కౌచ్‌పై చిరంజీవి కామెంట్‌.. నిహారిక రియాక్షన్‌

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో నిర్మాత నిహారిక ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి రియాక్ట్ అయ్యింది. ఆ మధ్య చిరంజీవి ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదనే కామెంట్‌ చేశారు. ప్రతిభ ఉంటే రాణించవచ్చని చెప్పారు. ఈ ప్రశ్న ఇప్పుడు నిహారికకి ఎదురయ్యింది. దీనికి ఆమె స్పందిస్తూ, ఇవాళ క్యాస్టింగ్‌ కౌచ్‌కి పెద్ద అర్థం ఉంది. చట్టపరంగానూ దాని అర్థం చాలా పెద్దది. కానీ మనం మాట్లాడుకునేది   ఫోర్స్ బుల్‌గా చేయడమనేది. కానీ పెదనాన్న వైడర్‌ పర్స్పెక్టివ్‌లో మాట్లాడారు. నిజానికి లీగల్‌గా చూస్తే దానికి మూడు నాలుగు సెక్షన్లు ఉన్నాయి. ఆయన వాటి కోణంలో మాట్లాడి ఉంటారని అనుకుంటున్నా` అని చెప్పింది నిహారిక.

55
`రాకాస`తో నెక్ట్స్ లెవల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

ఆమె ఇంకా మాట్లాడుతూ, ‘పింక్ ఎలిఫెంట్ నుంచి వచ్చే ప్రతీ కంటెంట్‌ను ఆడియెన్స్ ప్రేమిస్తూ, సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ‘రాకాస’ చెప్పిన కథ నాకు వెంటనే నచ్చేసింది. సినిమా ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నదే నా పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్ లక్ష్యం. ‘రాకాస’తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. థియేటర్‌కు వచ్చిన వాళ్లని మాత్రం నిరాశపర్చం. ఈ చిత్రంతో సంగీత్ మరింత షైన్ అవుతాడు. నేను ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి వెళ్లాలని సినిమాలు తీయలేదు. ప్యాషన్‌తో, ప్రేమతో సినిమాల్ని తీస్తున్నాను. అలా ‘కమిటీ కుర్రోళ్లు’ అవార్డుల్ని అందుకుంది. ‘రాకాస’ కూడా అంతే ప్రేమతో, ప్యాషన్‌తో నిర్మించాను. ఎక్కడికి వరకు వెళ్తుందో చూడాలి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ని నేను మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందరితో, అన్ని రకాల జానర్ల సినిమాల్ని తీస్తాను` అని తెలిపింది నిహారిక. ఇందులో హీరో సంగీత్‌ శోభన్‌, దర్శకురాలు మానస శర్మ, గెటప్‌ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories