`సెట్‌లోనే రాసలీలలు`.. సీరియల్‌ నుంచి తీసేశారంటూ నటుడు సమీర్‌ ఆవేదన.. నాగబాబుతో విభేదాలపై క్లారిటీ

Published : Feb 18, 2022, 06:24 PM IST

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న నటుడు సమీర్‌ తాజాగా షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. షూటింగ్‌లో సెట్‌లో ఎఫైర్‌ నడిపిస్తున్నారంటూ సీరియల్‌ నుంచి తొలగించారని వెల్లడించారు. దీంతోపాటు నాగబాబుతో విభేదాలపై క్లారిటీ ఇచ్చారు.  

PREV
16
`సెట్‌లోనే రాసలీలలు`.. సీరియల్‌ నుంచి తీసేశారంటూ నటుడు సమీర్‌ ఆవేదన.. నాగబాబుతో విభేదాలపై క్లారిటీ

నటుడు సమీర్‌(Actor Sameer) కెరీర్‌ సీరియల్స్ నుంచే ప్రారంభమైంది. ఆయన అప్పట్లో సీరియల్స్ లో మెయిన్‌రోల్స్ చేశారు. ఈటీవీలో అనేక సీరియల్స్ చేశారు. అన్నింటిలోనూ హీరోగా నటించారు. కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలో ఆయన్ని ఉన్నట్టుండి సీరియల్స్ నుంచి తొలగించారట. ఈటీవీ సుమన్‌ తనని సీరియల్‌ నుంచి తొలగించారని, ఎలాంటి సంజాయిషీ కూడా అడక్కుండా పంపించేయడం బాధ కలిగించిందని చెబుతున్నారు నటుడు సమీర్. 

26

Sameer లేటెస్ట్ ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో భాగంగా తను ఈటీవీలో ఓ ప్రముఖ సీరియల్‌లో నటిస్తున్న సమయంలో తనపై ఎఫైర్‌ ఆరోపణలు వచ్చాయని చెప్పారు. సెట్‌లోనే ఎఫైర్‌ నడిపిస్తున్నాని, ఎవరో ఈటీవీ సుమన్‌గారికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని,  దీంతో ఆయన ఆ సీరియల్‌ నుంచి తొలగించారని, అంతేకాదు ఆ సీరియల్‌ని కూడా ఆపేశారని చెప్పారు. 

36

లవ్‌ ఎఫైర్‌ నడుస్తుంటే.. లవ్‌ చేసుకోవడానికి నాకు బయట ఎక్కడ ప్లేస్‌ లేదా? సెట్‌లోనే ఉంటుందా,? అని ప్రశ్నించిన సమీర్‌.. సుమన్‌గారూ కూడా తనని ఏం జరిగిందనే సంజాయిషీ అడగలేదని, అడక్కుండానే నిర్ణయం తీసుకుని ఆ సీరియల్‌ని ఆపేశారని, దీంతో సడెన్‌గా తాను ఖాళీ అయిపోయానని, చాలా ఇబ్బంది అయ్యిందని చెప్పారు. రెంట్లు కట్టేపరిస్థితి లేదని, కారు ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి నెలకొందని, అంతకు ముందు రావాల్సిన చెక్కులు కూడా ఆపేశారని, దీంతో కొన్నాళ్లపాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్పారు సమీర్‌. 
 

46

అయితే ఇప్పుడు సినిమాల్లోకి రావడానికి మాత్రం ఓ రకంగా కారణం సుమన్‌గారే అని, ఈ సందర్భంగా ఆయనకు నమస్కారం చెబుతున్నట్టు తెలిపారు. కానీ కొంత కాలం తర్వాత తనకు సుమన్‌ గారుఫోన్‌ చేసి సార్వీ చెప్పారని, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పారు. తన మనసు విరిగిపోయిందని చెప్పారు. ఈ సంఘటన కారణంగానే రెండేళ్లపాటు బ్రేక్‌ తీసుకున్నానని చెప్పారు సమీర్‌. 

56

సినిమాల్లోకి వచ్చాక నాగబాబుతో తలెత్తిని విభేదాలపై స్పందించారు నటుడు సమీర్‌. పవన్‌ కళ్యాణ్‌ నటించిన `కొమురంపులి` చిత్ర షూటింగ్‌ సమయంలో సినిమాపై ఓ స్టోరీ రాశారని, పవన్‌(Pawan Kalyan) గారిని పెట్టుకుని ఎలాంటి సినిమా తీస్తున్నారని ఆవేదనతో రాశానని, కానీ అది నాగబాబు(Nagababu)కి నచ్చలేదని, దీంతో తిట్టి ఆ ఆర్టికల్‌ని తీయించారని చెప్పారు. ఈ విషయంపై పవన్‌ కళ్యాణ్‌ ఫోన్‌ చేసి మాట్లాడారని, ఆ విషయం అంతటితో అయిపోయిందన్నారు. 
 

66

ఆ తర్వాత `ఆరేంజ్‌` సినిమా సమయంలో విదేశాల్లో షూటింగ్‌కి వెళ్లొచ్చామని, సినిమా రిలీజ్‌ అయిన తర్వాత నాకు, నాగబాబుకి మధ్య అపార్థాలు క్రియేట్‌ చేశారని చెప్పారు. నాగబాబుగారు తనని క్లోజ్‌గా చూసుకునే వారని, తాను వేసే జోకులు ఆయనకిష్టమని, అలా తనని క్లోజ్‌గా చూసుకున్నారని, కానీ అది నచ్చని వారు మా మధ్య చిచ్చు పెట్టారని చెప్పారు సమీర్‌.  అయితే ఇప్పుడవి సర్ధుమనుగాయని, ఇప్పుడు ఫ్రీగానే ఉంటామన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories