HBD Anupama: బర్త్ డే గర్ల్ అనుపమ గ్లామర్ మెరుపులు.. చీరకట్టులో సొగసుల వయ్యారాలు..(Photos)

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 18, 2022, 05:23 PM ISTUpdated : Feb 18, 2022, 08:04 PM IST

అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

PREV
16
HBD Anupama: బర్త్ డే గర్ల్ అనుపమ గ్లామర్ మెరుపులు.. చీరకట్టులో సొగసుల వయ్యారాలు..(Photos)

అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆమె క్యూట్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి. 

26

శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో Anupama Parameswaran నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

36

ప్రస్తుతం అనుపమ 18 పేజెస్, కార్తికేయ 2, రౌడీ బాయ్స్ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో కూడా అనుపమ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. చీరకట్టులో అందాల దేవతలా అనుపమ చిరునవ్వులు చిందిస్తోంది. 

46

విశేషం ఏమిటంటే నేడు అనుపమ పుట్టినరోజు. తన బర్త్ డే సందర్భంగా అనుపమ అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అందమైన చీరలో అనుపమ మరింత అందంగా వెలిగిపోతోంది. అనుపమ 26వ వసంతంలోకి అడుగుపెట్టింది. దీనితో ఈ ఫోటోలకు చాప్టర్ 26 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

56

అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో అనుపమని కూడా దురదృష్టం వెంటాడింది. మొదట 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది. 

66

ప్రస్తుతం అనుపమ 18 పేజెస్, రౌడీ బాయ్స్, కార్తికేయ చిత్రాలపై ఆశలు పెట్టుకుంది. ఈ మూడు చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. ఇక కార్తికేయ 2 చిత్రాన్ని దర్శకుడు చందూ ముండేటి నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. నేడు అనుపమ బర్త్ డే సందర్భంగా 18 పేజెస్ చిత్ర యూనిట్ కూడా అందమైన పోస్టర్ తో ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపింది. 

click me!

Recommended Stories