హీరోయిన్ లయతో పెళ్లి ఆల్మోస్ట్ ఫిక్స్, చివరి నిమిషంలో డ్రాప్ అయిన నటుడు.. అందువల్లే అని ఓపెన్ గా చెప్పేశాడు

టాలీవుడ్ లో హోమ్లీ హీరోయిన్ గా రాణించిన వారిలో లయ ఒకరు. లయ పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా చేరువైంది.

Laya Gorty

టాలీవుడ్ లో హోమ్లీ హీరోయిన్ గా రాణించిన వారిలో లయ ఒకరు. లయ పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా చేరువైంది. వేణు, శ్రీకాంత్, జగపతి బాబు, శివాజీ లాంటి హీరోలతో లయ సినిమాలు చేసింది. అనేక విజయాలు కూడా సొంతం చేసుకుంది. 

లయ 2006లో గణేష్ అనే డాక్టర్ ని వివాహం చేసుకుంది యుఎస్ లో సెటిల్ అయింది. ఇన్నేళ్ల తర్వాత లయ మళ్ళీ టాలీవుడ్ లోకి నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ తమ్ముడు చిత్రంలో  లయ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. అయితే లయ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక విషయం వైరల్ గా మారింది. నటుడు సాయి కిరణ్.. నువ్వే కావాలి, ప్రేమించు లాంటి చిత్రాలతో గుర్తింపు పొందాడు. 

Also Read : ఏజ్ గ్యాప్ 40 ఏళ్ళు, మనవరాలిగా నటించిన అమ్మాయినే హీరోయిన్ గా..ఎన్టీఆర్ ని ఎలా ఒప్పించారో తెలుసా


Heroine Laya

ప్రేమించు చిత్రంలో సాయి కిరణ్, లయ జంటగా నటించారు. ఆ సమయంలోనే సాయి కిరణ్ కి లయని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిందట. సాయి కిరణ్ కుటంబ సభ్యులు కూడా వీళ్ళిద్దరూ జంటగా చూడ ముచ్చటగా ఉన్నారని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. లయ కూడా సుముఖత వ్యక్తం చేసింది. 

అయితే సాయి కిరణ్, అతడి కుటుంబ సభ్యులు జాతకాలని బలంగా నమ్ముతారు. తాజాగా ఇంటర్వ్యూలో సాయి కిరణ్ ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పారు. లయని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట వాస్తవమే. కానీ మా ఇద్దరికీ జాతకాలు కలవలేదు. నేను జాతకాలని బలంగా నమ్ముతాను. జాతకాలని నేను అర్థం చేసుకున్నాను. అందుకే నమ్ముతాను. 

జాతకాలు కలవలేదు కాబట్టి లయని పెళ్లి చేసుకోలేదు. మేము కూడా పెళ్లి గురించి సీరియస్ గా అనుకోలేదు. కుదిరితే చూద్దాం లేదంటే లేదు అన్నట్లుగా ఉన్నాం అని సాయి కిరణ్ అన్నారు. జాతకాలతో పాటు తనకి శివ భక్తి కూడా ఎక్కువే అని సాయి కిరణ్ గుండెలపై ఉన్న శివుడి టాటూ చూపించారు. 

Latest Videos

click me!