ప్రశాంత్ ఒక భారతీయ నటుడు, వ్యాపారవేత్త, గాయకుడు, మరియు చిత్ర నిర్మాత. ఆయన ప్రధానంగా తమిళ సినీ రంగంలో పనిచేశారు. తమిళ చిత్రాలతో పాటు, తెలుగు, హిందీ, మలయాళ చిత్రాలలో కూడా నటించారు. 1990ల చివరిలో ఆయన కెరీర్ ఉచ్ఛస్థితిలో ఉంది. అప్పట్లో దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ నటులలో ఒకరు. నటుడు, దర్శకుడు త్యాగరాజన్ కుమారుడు. 17 ఏళ్ల వయసులో వైగాసి పోరంధాచు (1990) చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1998లో వచ్చిన జీన్స్ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2005 తర్వాత ఆయనకు సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. 20 ఏళ్ల తర్వాత అంధగన్ (2024), ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (2024) చిత్రాలతో తిరిగి సినీ రంగంలోకి వస్తున్నారు.