షాలినికి ఉంగరం తొడిగిన నితిన్‌!

First Published | Jul 22, 2020, 5:31 PM IST

26 సాయంత్రం 8:30కు ఫలక్‌నుమా ప్యాలస్‌లో నితిన్‌ వివాహం జరగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబ పెద్దలతో పాటు వారికి అత్యంత సన్నిహితులైన అతి  కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నితిన్ ఎంగేజ్‌మెంట్‌ బుధవారం జరిగింది. ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో కొత్త జంట ఉంగరాలు మార్చుకున్నారు.

ఫైనల్‌గా నితిన్‌ ఎంగేజ్‌మెంట్ పూర్తయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి పనులు ప్రారంభించిన నితిన్‌, ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోవాలని ఏర్పాట్లు చేసుకున్నాడు. డెస్టినేషన్‌ వెడ్డింగ్ తరహాలో దుబాయ్‌లో పెళ్లి చేసుకోవాలని భావించినా కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా పెళ్లి వాయిదా పడింది. దీంతో పరిస్థితులు చక్కబడిన తరువాత పెళ్లి చేసుకోవాలని భావించినా ఇప్పట్లో ఆ పరిస్థితి కనిపించకపోవటంతో ఈ నెల 26న పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు నితిన్.
undefined
ఈ మేరకు ఇప్పటికే అత్యంత సన్నిహితులకు ఆహ్వాన పత్రికలు అంధించాడు. 26 సాయంత్రం 8:30కు ఫలక్‌నుమా ప్యాలస్‌లో నితిన్‌ వివాహం జరగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబ పెద్దలతో పాటు వారికి అత్యంత సన్నిహితులైన అతి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నితిన్ ఎంగేజ్‌మెంట్‌ బుధవారం జరిగింది. ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో కొత్త జంట ఉంగరాలు మార్చుకున్నారు.
undefined
Tap to resize

నితిన్‌, షాలినిల ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నితిన్ ఈ ఏడాది భీష్మ చిత్రంతో సూపర్‌ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత రంగే దే షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ లోగా లాక్‌ డౌన్‌ రావటంతో షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. ఈ సినిమాతో పాటు అంధాదున్‌ రీమేక్‌, కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్‌ పేట సినిమా, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు నితిన్‌.
undefined
undefined

Latest Videos

click me!