శోభన్ బాబుని అడిగారని నాకు తెలియదు.. త్రివిక్రమ్ బతిమాలినా బాలు ఒప్పుకోలేదు.. కానీ, నాజర్ కామెంట్స్ 

Published : Jun 01, 2024, 04:44 PM IST

ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ తమిళ వ్యక్తే అయినప్పటికీ తెలుగులో కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఎన్నో చిత్రాల్లో నాజర్ క్యారెక్టర్ రోల్స్ తో పాటు విలన్ గా కూడా నటించారు.

PREV
16
శోభన్ బాబుని అడిగారని నాకు తెలియదు.. త్రివిక్రమ్ బతిమాలినా బాలు ఒప్పుకోలేదు.. కానీ, నాజర్ కామెంట్స్ 

ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ తమిళ వ్యక్తే అయినప్పటికీ తెలుగులో కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఎన్నో చిత్రాల్లో నాజర్ క్యారెక్టర్ రోల్స్ తో పాటు విలన్ గా కూడా నటించారు. అతడు, సింహాద్రి, బాహుబలి లాంటి చిత్రాలు నాజర్ కి అద్భుతమైన గుర్తింపు తీసుకువచ్చాయి. 

26

అతడు చిత్రంలో నాజర్ మహేష్ బాబు తాత పాత్రలో చాలా బాగా నటించారు. అయితే ఈ పాత్ర వెనుక పెద్ద తతంగమే జరిగింది అని నాజర్ తాజాగా ఇంటర్వ్యూలో తెలిపారు. త్రివిక్రమ్ గారు ఈ పాత్ర చెప్పినప్పుడు ఇది రెగ్యులర్ రోల్ కాదని కొత్తదనం ఉన్న పాత్ర అని అర్థం అయింది. ఈ పాత్ర కోసం ముందుగా శోభన్ బాబు గారిని అడిగారని మీకు తెలుసా అని యాంకర్ ప్రశ్నించగా నాజర్ స్పందించారు. 

36

శోభన్ బాబు చేయాల్సిన పాత్ర అని మీరు చెబితేనే వింటున్నా. ఒక వేళ అదే నిజమైతే నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే శోభన్ బాబు పాత్రని త్రివిక్రమ్ నాకు ఇచ్చారు. షూటింగ్ పూర్తయ్యాక డబ్బింగ్ చాలా పవర్ ఫుల్ గా ఉండాలని త్రివిక్రమ్ అనుకున్నారు. 

46
Trivikram Srinivas

అప్పట్లో నేను తెలుగులో డబ్బింగ్ చేసేవాడిని కాదు. దీనితో త్రివిక్రమ్.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్లారు. ఆయన నేను కమల్ హాసన్ కి తప్ప ఇంకెవరికి డబ్బింగ్ చెప్పను అని రిజెక్ట్ చేశారు. త్రివిక్రమ్ ఎంత రిక్వస్ట్ చేసినా ఒప్పుకోలేదు. కానీ చివరకి త్రివిక్రమ్.. సర్ మీరు ఒకసారి ఈ పాత్ర చూడండి.. మీకు నచ్చితేనే డబ్బింగ్ చెప్పండి అని అన్నారు. 

56

దీనితో బాలుగారు నా పాత్ర చూసి.. అద్భుతంగా ఉంది అంటూ వెంటనే డబ్బింగ్ చెప్పడానికి ఒప్పేసుకున్నారు. బాలు గారు డబ్బింగ్ చెప్పడంతో నా పాత్ర ఇంకా అద్భుతంగా మారింది అని నాజర్ గుర్తు చేసుకున్నారు. 

66

అతడు చిత్రంలో మహేష్ బాబు తాత పాత్రలో నటించాలని మురళి మోహన్ శోభన్ బాబుని అడిగారు. కానీ శోభన్ బాబు తాను హీరో పాత్రలు తప్ప ఇంకేమి చేయనని రిజెక్ట్ చేశారు. 

click me!

Recommended Stories